ETV Bharat / bharat

కశ్మీర్​పై పాక్​ జోక్యానికి ఆస్కారమే లేదు: రాహుల్​ - భారత్​

జమ్ముకశ్మీర్​ సమస్యపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్​ గాంధీ ట్విట్టర్​లో స్పందించారు. పాకిస్థాన్ సహా ఇతర ఏ దేశానికీ కశ్మీర్ అంశం​లో జోక్యం చేసుకునే అవకాశమే లేదన్నారాయన.

కశ్మీర్​పై పాక్​ జోక్యానికి ఆస్కారమే లేదు: రాహుల్​
author img

By

Published : Aug 28, 2019, 11:35 AM IST

Updated : Sep 28, 2019, 2:08 PM IST

కశ్మీర్​పై పాక్​ జోక్యానికి ఆస్కారమే లేదు: రాహుల్​

కశ్మీర్​లో విషయంలో జోక్యం చేసుకోవటానికి పాకిస్థాన్​ సహా ఇతర ఏ దేశానికీ స్థానం లేదని, కశ్మీర్ ముమ్మాటికీ భారత్​లో అంతర్భాగమని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు.

కశ్మీర్​లో హింసను ప్రేరేపించేందుకు పాకిస్థాన్​ ప్రయత్నిస్తోందని, ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మేము ప్రభుత్వంతో ఎన్నో విషయాల్లో విభేదించాం. కానీ ఇప్పుడు స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. కశ్మీర్​ అనేది భారత్​లో అంతర్భాగం. పాకిస్థాన్​ సహా ఇతర ఏ దేశానికైనా సరే ఇక్కడ జోక్యం చేసుకునే ఆస్కారం లేదు.

జమ్ముకశ్మీర్​లో హింస కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి హింసకు పాల్పడటమే."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నాయకుడు

ఇదీ చూడండి:'చిదంబరాన్ని దోషిగా చూపేందుకు ప్రభుత్వం కుట్ర'

Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.