ETV Bharat / bharat

కర్తార్​పుర్​ నడవాపై నేడు భారత్​-పాక్​ చర్చలు

కర్తార్​పుర్​ నడవాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత్​ భావిస్తోంది. ఇందుకోసం అఠారీ- వాఘా సరిహద్దులో నేడు పాక్​ అధికారులతో మరోసారి చర్చలు జరపనుంది. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవాపై ఎంతమంది యాత్రికులను అనుమతించాలన్న అంశాలపై అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.

author img

By

Published : Jul 14, 2019, 4:59 AM IST

కర్తార్​పుర్​ నడవాపై నేడు భారత్​-పాక్​ చర్చలు
కర్తార్​పుర్​ నడవాపై నేడు భారత్​-పాక్​ చర్చలు
కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై నేడు
భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశం కానున్నారు. పాకిస్థాన్​లోని అఠారీ-వాఘా సరిహద్దులో చర్చలు జరపనున్నారు. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై ప్రధానంగా మంతనాలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చలు జరపనున్నారు.

ఎక్కువ భాగం పాక్​లోనే

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం పూర్తయితో పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అయితే నడవా ఎక్కువ భాగం పాక్​ భూభాగంలో ఉండనుంది. అందువల్ల వరదలను కూడా తట్టుకునేలా నడవాను నిర్మించాలని పాక్​ అధికారులకు సూచిస్తోంది భారత్​.

అక్టోబర్​ 31కి పూర్తి...

గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019, నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి నడవా నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం. ప్రత్యేక సందర్భాల్లో 10 వేల మంది భక్తులు, సాధారణ రోజుల్లో 5 వేల మందిని పాక్‌ పంపించేందుకు కృషి చేస్తోంది. యాత్ర పొడవునా బలమైన భద్రత కోసం అధునాతన నిఘా వ్యవస్థను ఉపయోగించనుంది.

కర్తార్​పుర్​ నడవాపై నేడు భారత్​-పాక్​ చర్చలు
కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై నేడు భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశం కానున్నారు. పాకిస్థాన్​లోని అఠారీ-వాఘా సరిహద్దులో చర్చలు జరపనున్నారు. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై ప్రధానంగా మంతనాలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చలు జరపనున్నారు.

ఎక్కువ భాగం పాక్​లోనే

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం పూర్తయితో పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అయితే నడవా ఎక్కువ భాగం పాక్​ భూభాగంలో ఉండనుంది. అందువల్ల వరదలను కూడా తట్టుకునేలా నడవాను నిర్మించాలని పాక్​ అధికారులకు సూచిస్తోంది భారత్​.

అక్టోబర్​ 31కి పూర్తి...

గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019, నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి నడవా నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం. ప్రత్యేక సందర్భాల్లో 10 వేల మంది భక్తులు, సాధారణ రోజుల్లో 5 వేల మందిని పాక్‌ పంపించేందుకు కృషి చేస్తోంది. యాత్ర పొడవునా బలమైన భద్రత కోసం అధునాతన నిఘా వ్యవస్థను ఉపయోగించనుంది.

Morigaon (Assam), Jul 13 (ANI): An empty building of a primary school in Tengaguri area of Morigaon district collapsed due to the increasing water in the Brahmaputra River flowing through the region, yesterday. At least 17 districts in the state have been affected by the flood. Home Ministry has directed Disaster Management Department to stay in touch with the flood-prone states and take up necessary measures and remain alert to deal with the flood.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.