ETV Bharat / bharat

గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం

author img

By

Published : Jun 17, 2020, 3:39 PM IST

కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తూ 'మాస్క్​ ​డే'ను నిర్వహించేందుకు సిద్ధమైంది కర్ణాటక ప్రభుత్వం. మాస్క్​లు, శానిటైజర్​​, భౌతిక దూరం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం ర్యాలీ నిర్వహించనున్నారు.

Karnataka to observe "Mask Day" on June 18
కరోనాపై అవగాహన కోసం 'మాస్క్​ డే'

కర్ణాటక ప్రభుత్వం గురువారం రాష్ట్రవ్యాప్తంగా 'మాస్క్​డే'ను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టేదిశగా.. మాస్క్​లు, శానిటైజర్​, సబ్బుతో చేతుల్ని శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించే విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.

50 మందికి మించకుండా..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయ భాస్కర్ ఈమేరకు​ అన్ని జిల్లా, తాలుకా స్థాయి అధికారులతో చర్చించి ?ఈ నిర్ణయం తీసుకున్నారు. మాస్క్​ డే సందర్భంగా నిర్వహించే అవగాహన ర్యాలీలో.. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొననున్నారు. ఒక్కోచోట 50 మందికి మించకుండా.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు అధికారులు.

మాస్క్​ లేకుంటే జరిమానా!

మాస్క్ ​డే నిర్వహణకు సానుకూలంగా స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి​ యడియూరప్ప.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం నిబంధనల్ని పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సహా.. రూ. 200 జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: దేశంలో ఒక్కరోజులో 2003 కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.