దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో మరో 8,477 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా కేసుల సంఖ్య 7.43 లక్షలకు చేరింది. మహమ్మారికి మరో 85 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 10,283కు ఎగబాకింది.
- మహారాష్ట్రలో మరో 10,226 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 15,64,615కు చేరింది. కరోనాతో మరో 337మంది చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 41,196కు పెరిగింది.
- కేరళలో గురువారం ఒక్కరోజే 7,789 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 3,15,929కి ఎగబాకింది. మరో 23 మరణాలతో.. ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,089కి చేరింది.
- తమిళనాడులో మరో 4,410 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కేసుల సంఖ్య 6లక్షల 74వేల 802కు పెరిగింది. మొత్తం 10,472 మంది మహమ్మారికి బలయ్యారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 2,728 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 4,04,545కు పెరిగింది. కొవిడ్‌తో మరో 36 మంది ప్రాణాలు విడవగా.. మరణాల సంఖ్య 2,728కి పెరిగింది.
- రాజస్థాన్‌లో మరో 2,039 కేసులు గుర్తించారు అధికారులు. బాధితుల సంఖ్య 1,67,279కు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 1,708 మంది కొవిడ్ వల్ల చనిపోయారు.
ఇదీ చదవండి: తగ్గుతున్న కరోనా వ్యాప్తి- ఈ లెక్కలే సాక్ష్యం!