ETV Bharat / bharat

భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

ఒక్కప్పుడు రైళ్లు దట్టమైన పొగలను ఒదులుతూ కూతపెట్టేవి. మరిప్పుడు బుల్లెట్ రైలైనా చప్పుడు చేయకుండా దూసుకెళ్తోంది. భారతీయ రైల్వేలోనూ శతాబ్ద కాలంలో ఒకటా రెండా.. ఎన్నో మార్పులు జరిగాయి. వాటన్నింటినీ కళ్లకు కట్టేలా కర్ణాటకలో ఓ మ్యూజియం ఏర్పాటు చేసింది భారత రైల్వే. ఆ మ్యూజియాన్ని హుబ్బలి ప్రజలకు అంకితమిచ్చారు రైల్వేమంత్రి.

karnataka-railway-museum-dedicated-to-public-by-union-minister
రైల్వే ప్రస్థానం తెలుపుతున్న మ్యూజియం!
author img

By

Published : Aug 10, 2020, 11:49 AM IST

భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

స్టీమ్ ఇంజిన్ నుంచి అత్యాధునిక బుల్లెట్ రైళ్ల వరకు.. భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే విధంగా కర్ణాటకలో ఓ రైల్వే మ్యూజియం ఏర్పాటైంది. ఈ ప్రదర్శనను హుబ్బలి జిల్లా ప్రజలకు అంకితం చేశారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. హుబ్బలి ప్రజలతో భారత రైల్వేకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు.

హుబ్బల్లిలోని దక్షిణ-పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు అధికారులు. 1907లో నిర్మించిన కార్టేజీలను రెండు భాగాలుగా చేసి.. ప్రదర్శనాలయం స్థాపించారు. ఓ భాగానికి మలప్రభ, మరో భాగానికి ఘాటప్రభా అనే నదుల పేర్లతో నామకరణం చేశారు.

రైల్వే ప్రపంచంలోకి స్వాగతం పలికేలా ప్రవేశ ద్వారం వద్ద ఓ కమాను. భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడేలా ఓ ప్యాసెంజర్ బోగీ, స్లీపర్ బోగీలు, క్రాసింగ్ గేట్లు, సిగ్నల్ లైట్లు మ్యూజియంలో ఆకట్టుకుంటున్నాయి. థియేటర్ కోచ్, సురుచి క్యాంటీన్, రైలు నమూనా, ఓ షాపు, టికెట్ ప్రింటింగ్ మెషిన్, ఇతర బొమ్మలతో పాటు.. పిల్లలు ఆడుకునే ఓ గది... ఇలా ఒకటేమిటి రైల్వే ప్రస్థానమంతా కళ్లకు కట్టేలా ఉందీ మ్యూజియం.

ఇదీ చదవండి: సబ్​మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.