ETV Bharat / bharat

కర్ణాటకీయం: రాజకీయ జగన్నాటకం సశేషమే!

కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా సంక్షోభంలో పడిపోయాయి. యడియూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేశాక కొంతమేర శాంతించినా కర్ణాటకం ఇంకా సశేషమే. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఉప ఎన్నికలు, సుప్రీం కేసులు తదితరాలన్నీ మిగిలే ఉన్నాయి.

author img

By

Published : Jul 31, 2019, 4:03 PM IST

కర్ణాటకీయం

కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగి, యెడియూరప్ప సారథ్యంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరాక ఒక కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వాలు మారినంతనే మొత్తం కథ ముగిసిందని చెప్పలేని పరిస్థితి ఉంది. తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసిన 17 మందిపై అప్పటి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత వేటు వేయగా రాజ్యాంగపరమైన సంక్లిష్టతలు తలెత్తాయి.

కాంగ్రెస్‌, జేడీఎస్​లతో తెగతెంపులు చేసుకొని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని ఆమోదించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. వారిలో పదిమంది సభ్యులు నేరుగా ఆయనను కలిసి రాజీనామాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించినప్పుడు సభ్యులు గైర్హాజరు అయ్యారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని కాంగ్రెస్‌, జేడీఎస్​లు గట్టిగా పట్టుబట్టాయి.

స్పీకర్​ సంచలన నిర్ణయం

ఈ రెండు పార్టీల ఫిర్యాదుల మేరకు ప్రస్తుత శాసనసభ కాలపరిమితి పూర్తయ్యేవరకూ రాజీనామా చేసిన సభ్యులెవరూ తిరిగి పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ స్పీకర్‌ నిర్ణయించడం సంచలనం సృష్టించింది. ఫలితంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల ఆశలు అడియాశలయ్యాయి. భాజపా తరఫున వారికి టికెట్లు కట్టబెట్టి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలన్న యెడియూరప్ప ఆలోచనలూ భగ్నమయ్యాయి!

మొత్తం వ్యవహారం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. మరోవంక తమపై అనర్హత వేటును సవాలు చేస్తూ సభ్యులందరూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ‘సుప్రీం’ తీర్పు ఎలా ఉండబోతుందన్న అంచనాలు పక్కనపెడితే రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తూట్లు పొడిచాయనడంలో సందేహం లేదు.

రాజీనామాలతో రాజుకున్న వివాదం

కాంగ్రెస్‌, జనతాదళ్‌(ఎస్‌)లకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ కార్యాలయానికి వెళ్ళి తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకొంది. తాను కార్యాలయంలో లేని సమయంలో సభ్యులు రాజీనామా పత్రాలు ఇచ్చి వెళ్ళారు కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకోలేనని ఆయన తేల్చిచెప్పారు. ఎవరి ఒత్తిడికో తలొగ్గి రాజీనామాలు ఇచ్చారా లేక స్వచ్ఛందంగా సమర్పించారా అన్న విషయం తేటపడాలంటే సభ్యులను నేరుగా కలవాల్సి ఉందని శాసన సభాపతి వ్యాఖ్యానించారు.

నిబంధనల ప్రకారం శాసన సభ్యులెవరైనా ప్రత్యక్షంగా స్పీకర్‌ను కలిసి ‘స్వచ్ఛందంగా, ఎలాంటి ఒత్తిళ్లకూ లోనుకాకుండా నిజాయతీగా రాజీనామా చేస్తున్నామని వెల్లడించిన పక్షంలో (అందుకు స్పీకర్‌ సంతృప్తి చెందితే) ‘వెనువెంటనే’ సభాపతి ఆ రాజీనామాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు నేరుగా సమర్పించకపోతే, నిబంధనలమేరకు సభాపతి విచారణ సాగించవచ్చు. ఆ సభ్యులు స్వచ్ఛందంగా, నిజాయతీగా తమ పదవులకు రాజీనామా చేశారా లేదా అన్న విషయాన్ని లోతుగా విచారించి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది. ఒకవేళ సభ్యుల సమాధానాలతో ఆయన సంతృప్తి చెందకపోతే ఆ రాజీనామా పత్రాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు.

విప్​ బ్రహ్మాస్త్రం

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పదిమంది శాసనసభ్యులు స్పీకర్‌ను నేరుగా కలిసి తమ రాజీనామాలకు కారణాలు వివరించారు. అనంతరం అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పాలక సంకీర్ణానికి చెందిన కాంగ్రెస్‌, జనతాదళ్‌(ఎస్‌)లు తమ సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరై విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేయాలని ‘విప్‌’ జారీ చేశాయి. రాజీనామా చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆ ‘విప్‌’ను పట్టించుకోకుండా ముంబయిలోనే ఉండిపోయారు.

ఒకదానివెంట ఒకటిగా చోటుచేసుకున్న ఆ పరిణామాలను, అసెంబ్లీ నిబంధనలను విశ్లేషిస్తే తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించి ఉండాల్సింది అనిపిస్తోంది. సభలో విశ్వాస పరీక్ష నిర్వహణకు చాలా రోజుల ముందే వారు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయా పార్టీలు జారీ చేసిన ‘విప్‌’లు తమకు వర్తించవని తిరుగుబాటు ఎమ్మెల్యేలు భావించారు.

కూటమి ప్రయత్నాలు

తమ పార్టీ గూళ్లనుంచి ఎగిరిపోయిన ఆ సభ్యులను తిరిగి దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌, జనతాదళ్‌ (ఎస్‌)లు పక్షం రోజులపాటు రకరకాల ప్రయత్నాలు చేశాయి. అక్రమంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను తరలించి ముంబయిలో దాచారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులూ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నాయకుడు డీకే శివకుమార్‌ ముంబయిలో శాసనసభ్యులు ఉన్న హోటల్‌లోకి వెళ్ళేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. హోటల్‌ను సందర్శిస్తున్న కర్ణాటక నాయకుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆ ఎమ్మెల్యేలు ముంబయి పోలీసులను అభ్యర్థించారు. హోటల్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు శివకుమార్‌ను నిలువరించారు.

వెంకయ్య తీరు ఇలా..

సభ్యుల రాజీనామాలపై రాజ్యసభ ఛైర్మన్‌గా ఇటీవల వెంకయ్యనాయుడు వ్యవహరించిన తీరుకూ, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా రమేశ్‌ కుమార్‌ వ్యవహార సరళీకి మధ్య అంతరం కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నీరజ్‌ కుమార్‌ అనే రాజ్యసభ సభ్యుడు ఈ నెల 15న సభాపతికి రాజీనామా పత్రం సమర్పించారు. వెంటనే ఆ సభ్యుడిని సభాపతి తన వద్దకు పిలిపించుకున్నారు. స్వచ్ఛందంగా, పూర్తి నిబద్ధతతో ఆ సభ్యుడు రాజీనామా చేశారా, ఆయన తన నిర్ణయంపై పునరాలోచిస్తారా అన్న విషయాలను అడిగి కనుక్కున్నారు. సభ్యుడి సమాధానాలతో సభాపతి సంతృప్తి చెందారు. ఆ మరుసటి రోజే నీరజ్‌ కుమార్‌ రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడించారు. రాజీనామాపై సభ్యుడు పట్టుబట్టినప్పుడు వెంటనే దానిని ఆమోదించి, సంబంధిత లాంఛనాలు పూర్తి చేయాలని కార్యాలయ అధికారులను వెంకయ్య నాయుడు ఆదేశించారు.

నాటి పరిణామాలు నేడు పునరావృతం

పార్టీ సభ్యుల గోడ దూకుళ్లను 91వ రాజ్యాంగ సవరణ దాదాపు అసాధ్యంగా మార్చేసింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి రావడానికి సంఖ్యాపరంగా తక్కువపడితే అవతలి పక్షం ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో పదవులకు రాజీనామా చేయించి- వారికి తమ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడమే పాలక పక్షాలకు మార్గాంతరంగా మారింది.

2008లో అధికారంలోకి వచ్చేందుకు కొన్ని స్థానాలు తగ్గినప్పుడు యెడియూరప్ప చేసింది ఇదే. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు కాబట్టి మొత్తంగా సభను రద్దు చేసి, మరోసారి ఎన్నికలకు వెళ్ళడం కన్నా కొందరు సభ్యులు బయటపడి మరో పార్టీ టికెట్‌పై తిరిగి పోటీ చేసి, ప్రజామోదం కోరడమే సహేతుకమైనదన్నది నా అభిప్రాయం. కర్ణాటకలో 2008 నాటి పరిణామాలే ఇప్పుడూ పునరావృతమయ్యాయి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ ఆదేశించిన నేపథ్యంలో ‘న్యాయ నిర్ణయం’పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో ఏదో ఒకటి తేలేవరకూ కర్‌‘నాటకం’ కొనసాగుతూనే ఉంటుంది!

ఇదీ చూడండి: కర్ణాటక కొత్త స్పీకర్​గా కాగేరీ బాధ్యతలు

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Detroit, Michigan – 30 July 2019
1. STILL: From left, Marianne Williamson, Rep. Tim Ryan, D-Ohio, Sen. Amy Klobuchar, D-Minnesota, South Bend Mayor Pete Buttigieg, Sen. Bernie Sanders, I-Vermont, Sen. Elizabeth Warren, D-Massachusetts, former Texas Rep. Beto O'Rourke, former Colorado Gov. John Hickenlooper, former Maryland Rep. John Delaney and Montana Gov. Steve Bullock take the stage
2. SOUNDBITE (English) Senator Elizabeth Warren, (D) Presidential Candidate:
"Donald Trump has a vision of how to win and he's gotten out there and done it. He said if there is something wrong in your life, if your life is not working, if you're under a lot of economic pressure, blame them - blame people who don't look like you, blame people who don't sound like you, blame people who weren't born where you were born, blame people who don't worship like you. Well, I have a very different story about what is wrong. What's wrong right now is that we have a government. We have a Washington that works great for the wealthy,  for the well-connected, for the people with money. It's just not working for anyone else. But in a democracy we got a chance to change that and that's what 2020 is all about."
3. STILL: From left, Sen. Amy Klobuchar, D-Minn., South Bend Mayor Pete Buttigieg, Sen. Bernie Sanders, I-Vt., Sen. Elizabeth Warren, D-Mass., and former Texas Rep. Beto O'Rourke on stage
4. SOUNDBITE (English) Senator Bernie Sanders , (I) Presidential Candidate:
"Here is the irony and I hope everybody in America knows this. We are right now in Detroit, Michigan. You and I can take a walk in 15 minutes we could be in Canada. In Canada when you have major surgery, which would cost hundreds of thousands of dollars in this country, in Canada you don't take out your wallet. In Canada you can go to any doctor you want, any hospital that you want. Meanwhile in this country we have over 80 million people who are either uninsured or underinsured. And that has everything to do with the fact that the drug companies and the insurance companies last year made a hundred billion dollars in profits. The function of health care is to provide quality care to all, not to see the drug companies and insurance companies. make billions of dollars in profits."
5. Marianne Williamson walking into the spin room after the debate
6. SOUNDBITE (English) Rep. Tim Ryan, (D) Presidential Candidate:
"How are you gonna go to tell people in my congressional district in Youngstown, Ohio that they're working their rear ends off to provide health care for their families, that an undocumented person in the country is going to get free health care. That, that is not going to work. And it's not fair, quite frankly. They should, the undocumented workers should be able to pay for health care. It just shouldn't be free."
7. STILL: Sen. Amy Klobuchar, D-Minn., and South Bend Mayor Pete Buttigieg participate in the first of two Democratic presidential primary debates
8. SOUNDBITE (English) Senator Amy Klobuchar, (D) Presidential Candidate:
"Look I'm a capitalist. I worked in the private sector for 14 years and I believe that you need a check and balance on capitalism. But that debate is not what people are talking to me about when I'm in Michigan or in Minnesota or in Iowa, Wisconsin. They want to know what's going to happen to their mom whose going into long term care. And that has been this big elephant in the room as everyone re-litigates the Affordable Care Act. We haven't been talking about long term care or Alzheimer's or mental health or chemical dependency. None of those things have been discussed and I'm really going to push for them on the next debate."
9. STILL: Gov. Steve Bullock on stage
10. SOUNDBITE (English) Gov. Steve Bullock, (D) Presidential Candidate:
"I did want to get both my message out we have to win back places we lost and not make a false distinction when a whole lot of folks often feel like these debates are disconnected from people's lives. I wanted to make sure not only did I win in a Trump state but to be able to get things done not just talking about it."
11. Exterior of Fox Theater in Detroit
12. SOUNDBITE (English) Beto O'Rourke, (D) Presidential Candidate:
"I will not criminally prosecute and will change the law to reflect this, anyone seeking refuge or asylum or shelter in this country. But if we rewrite this country's immigration laws, give you a safe orderly lawful path to work a job here or join your family, if we help those countries in Central America that are having such a hard time then I expect you to respect our laws and we will reserve the right to criminally prosecute those who do not follow our laws or who try to defraud the government of the United States."
13. Exterior of the Fox Theater
14. SOUNDBITE (English) John Delaney, (D) Presidential Candidate:
"No one on that stage has shown an ability to turn big ambitions into reality more than I have. So when people can't defend their positions, they say things like well you're not being ambitious enough. It would be like saying to John Kennedy when he called for us to put someone on the moon at the end of the century by the end of the decade. 'Well you didn't call for it to happen by the end of the year so it's not a big enough idea'. I mean it's it's just an intellectually dishonest response."
15. STILL: From left, former Colorado Gov. John Hickenlooper, former Maryland Rep. John Delaney and Montana Gov. Steve Bullock on stage
STORYLINE:
The signature domestic proposal by the leading progressive candidates for the Democratic presidential nomination came under withering attack from moderates Tuesday in a debate that laid bare the struggle between a call for revolutionary policies and a desperate desire to defeat President Donald Trump.
Standing side by side at center stage, Bernie Sanders and Elizabeth Warren slapped back against their more cautious rivals who ridiculed "Medicare for All" and warned that "wish-list economics" would jeopardize Democrats' chances for taking the White House in 2020.
A full six months before the first votes are cast, the tug-of-war over the future of the party pits pragmatism against ideological purity as voters navigate a crowded Democratic field divided by age, race, sex and ideology.
The fight with the political left was the dominant subplot on the first night of the second round of Democratic debates, which was notable as much for its tension as its substance.
Twenty candidates are spread evenly over two nights of debates Tuesday and Wednesday.
The second night features early front-runner Joe Biden, the former vice president, as well as Kamala Harris, a California senator.
The marathon presidential primary season won't formally end for another year, but there was an increasing sense of urgency for many candidates who are fighting for survival.
More than a dozen could be blocked from the next round of debates — and effectively pushed out of the race — if they fail to reach new polling and fundraising thresholds implemented by the Democratic National Committee.
Perhaps no issue illustrates the evolving divide within the Democratic Party more than health care.
Sanders' plan to provide free universal health care, known as Medicare for All, has become a litmus test for liberal candidates, who have embraced the plan to transform the current system despite the political and practical risks.
Medicare for All would abandon the private insurance market in favor of a taxpayer-funded system that would cover all Americans.
In targeting Medicare for All, the more moderate candidates consistently sought to undermine Sanders and Warren.
The moderates variously derided Medicare for All as too costly, ineffective and a near-certain way to give Republicans the evidence they needed that Democrats supported socialism.
Meanwhile, Trump said earlier in the day that he would watch Tuesday's primetime affair from the White House.
But his Twitter feed was uncharacteristically silent throughout the debate.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.