కర్ణాటక కలబురిగిలోని రాంమందిర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్త బైక్పై ఇంటికి వెళ్తున్న ఇద్దరిని టిప్పర్ ఢీకొని అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. టిప్పర్ పూర్తిగా శరీరాలపై నుంచి వెళ్లింది. దేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. నిర్లక్ష్యంతో ఇద్దరిని బలిగొన్న టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతులను విజయపుర జిల్లాకు చెందిన లింగప్ప(31), శివాలాల్(41)గా గుర్తించారు.
చివరి క్షణంలో ప్రాణాలతో పోరాడుతూ కన్ను మూసిన దృశ్యాలు సీసీ టీవిల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.