ETV Bharat / bharat

స్కూలు పిల్లలకు ఐస్‌క్రీముల్లో డ్రగ్స్ కలిపి వల! - karntaka corporate school students consuming drugs

కన్నడ కార్పొరేట్‌ స్కూళ్లకూ డ్రగ్‌ మాఫియా విస్తరించింది. ధనవంతుల పిల్లలకు ఐస్‌క్రీముల్లో డ్రగ్స్ కలిపిచ్చి.. వలలోకి లాగుతున్నారని పేర్కొన్నారు కర్ణాటక విద్యాశాఖ మంత్రి. ప్రత్యేక బృందంతో ఈ వ్యాపారాలపై నిఘా పెంచాలని సీఎం యడియూరప్ప ఆదేశించారు.

karnataka drugs mafia mixing drugs in  ice cream to grab corporate school students
స్కూలు పిల్లలకు ఐస్‌క్రీముల్లో డ్రగ్స్ కలిపి వల!
author img

By

Published : Sep 8, 2020, 8:30 AM IST

కర్ణాటక రాష్ట్రంలోని కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న ధనవంతుల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఐస్‌క్రీముల ద్వారా కొందరు దుండగులు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

మంత్రి బెంగళూరులో సోమవారం మాట్లాడుతూ తనకు అందిన సమాచారం మేరకు నగరంలో పలు ముఠాలు పాఠశాలల వద్ద ఐస్‌క్రీముల్లో మత్తుమందు కలిపి విద్యార్థులకు ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్‌ వ్యాపారాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ప్రత్యేక బృందంతో ఈ వ్యాపారాలపై నిఘా పెంచాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: ఆ చేతులే.. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.