దేశంలో కుండపోత వర్షాలకు చాలా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కర్ణాటకలోనూ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.
కొడుగు జిల్లా థోరా గ్రామంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. నవీన్ అనే యువకుడి తల్లి, చెల్లెలు తన కళ్ల ముందే మరణించారు. అదే సమయంలో అతడి స్నేహితుడు సతీశ్ బురదలో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్నాడు.
కుటుంబాన్ని కోల్పోయిన నవీన్... స్నేహితుడిని దక్కించుకోవాలనుకున్నాడు. ప్రాణాలకు తెగించి కాపాడాడు.
"నేను పునరావాస కేంద్రాలు ఉన్న ప్రదేశానికి సాయంకోసం వెళ్తున్నాను. అదే సమయంలో పిడుగు పడ్డ శబ్దంతో కొండ చరియలు విరిగి పడ్డాయి. నేను చూసేటప్పటికి నవీన్ తల్లి, చెల్లెలు చనిపోయారు. నా కాలు పూర్తిగా బురదలో చిక్కుకుపోయింది. అప్పుడు నా స్నేహితుడు నవీన్ వచ్చి 'నా అమ్మ చెల్లెలిని కాపాడుకోలేకపోయాను. కనీసం నిన్నైనా కాపాడుకుంటా' అని అన్నాడు"
-సతీశ్, నవీన్ స్నేహితుడు
ఇదీ చూడండి:మథుర: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు