దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. కర్ణాటకలో మరో 7,606 మందికి మహమ్మారి సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 7,17,915కు చేరింది. మరో 70 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 10,036కు ఎగబాకింది.
- మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గినట్టే కనిపిస్తోంది. కొత్తగా 7,089 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 15,35,315కు చేరింది. కరోనాతో మరో 165మంది చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40,514కు పెరిగింది.
- కేరళలో ఒక్కరోజులో 5,930 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 2,93,132కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 1,025 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 4,879 మంది కొవిడ్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 6,61,264కు చేరింది. మరో 62 మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 10,314కు ఎగబాకింది.
- దిల్లీలో సోమవారం ఒక్కరోజే 1,849 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 3,11,188కి చేరింది. వైరస్ సోకిన వారిలో మరో 40 మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,809కి పెరిగింది.
- పశ్చిమ్‌బంగాలో కొత్తగా 3,583 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 3లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు అక్కడ 5,862 మరణాలు నమోదయ్యాయి.
- రాజస్థాన్‌లో మరో 2,132 వైరస్ కేసులు గుర్తించారు అధికారులు. బాధితుల సంఖ్య 1,61,184కు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 1,665 మంది మహమ్మారికి బలయ్యారు.
ఇదీ చదవండి: కేరళ ప్రభుత్వ బడుల 'హైటెక్' ఘనత