ETV Bharat / bharat

పర్యటకుల కోసం రైల్వేశాఖ 'కామన్​ మ్యాన్' ఆలోచన​ - కర్ణాటక శివమొగ్గ జిల్లా అరసలు రైల్వే స్టేషన్​

ప్రయాణికులను ఆకర్షించేందుకు రైల్వేశాఖ వినూత్న ఆలోచన చేసింది. కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని అరసలు రైల్వేస్టేషన్​లో ప్రజాదరణ పొందిన కామన్​ మ్యాన్​ కార్టూన్​ను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. పర్యటకులను ఆహ్వానించటం కోసం దీనిని తయారు చేశారు రైల్వే శాఖాధికారులు.

Karnataka Common Man to welcome people at Malgudi railway station
పర్యాటకులను ఆహ్వానించనున్న 'కామన్​ మ్యాన్'​
author img

By

Published : Sep 19, 2020, 3:56 PM IST

కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని అరసలు రైల్వే స్టేషన్​కు వచ్చే పర్యటకులను ఆహ్వానించటానికి వినూత్న ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. బాగా ప్రాచుర్యం పొందిన 'కామన్ మ్యాన్' కార్టూన్​ ప్రతిమను స్టేషన్​లో ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు ప్రముఖ ధారావాహిక చిత్రం 'మాల్గుడి డేస్' నుంచి 'స్వామి అండ్​ ఫ్రెండ్స్' పాత్రల ప్రతిమలను కూడా ఏర్పాటు చేయనున్నారు అధికారులు.

Karnataka Common Man to welcome people at Malgudi railway station
'కామన్​ మ్యాన్'​ ప్రతిమ
Karnataka Common Man to welcome people at Malgudi railway station
పర్యాటకులను ఆహ్వానించనున్న 'కామన్​ మ్యాన్'​

మాల్గుడి డేస్​ ధారావాహిక..

1980-90ల చివరి కాలంలో ప్రసారమైన ధారావహికల్లో 'మాల్గుడి డేస్' అత్యంత ఆదరణ పొందింది. కుటుంబ భావోద్వేగాలతో నడిచిన ఈ నాటిక అప్పట్లో ప్రజల మనసులను దోచుకుంది. ఈ ధారావాహికలో స్వామి అండ్​ ఫ్రెండ్స్ పాత్రలు అందరి మన్నలను పొందాయి. ఆర్​.కె .నారాయణ్​ రచించిన ఓ కథాంశం ఆధారంగా దీనిని చిత్రీకరించారు.

ప్రజల్లో ఎంతో మన్నలను పొందిన ఈ పాత్రలను మళ్లీ ప్రజలకు చేరువ చేసే క్రమంలో రైల్వే శాఖ మాల్గుడి డేస్ పేరిట ఓ మ్యూజియంను ఏర్పాటు చేసింది. అందులో ఆ ధారావాహికకు చెందిన పాత్రల ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు.

పర్యటకులను ఆహ్వానించే 'కామన్​ మ్యాన్'​

కామన్ మ్యాన్​ కార్టూన్​ ఎక్కడిది?

ప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు ఆర్​. కె. లక్ష్మణ్.. దిన పత్రికల్లో కార్టూనిస్ట్​గా పని చేసేవాడు. సమాజంలో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రతిబింబించేలా కార్టూన్​లను గీసేవాడు. ఈ తరుణంలో దేశంలోని గ్రామీణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి చెప్పే క్రమంలో కామన్​ మ్యాన్​ అనే పాత్రను సృష్టించారు లక్ష్మణ్​. ఈ కామన్​మ్యాన్​ పాత్ర పాఠకుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో కామన్​ మ్యాన్​ కార్టూన్​ను​ అరసులు రైల్వేస్టేషన్ పరిధిలో ప్రతిష్టించనున్నారు అధికారులు.

ఐదు అడుగుల ఎత్తులో కార్టూన్​ ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.