ETV Bharat / bharat

మినీ లాక్​డౌన్: కరోనా కట్టడికి రాష్ట్రాల నిర్ణయం - Covid Effect lockdown in India

దేశంలో కరోనా​ కేసులు విజృంభిస్తోన్న నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్​డౌన్​కే మొగ్గుచూపుతున్నాయి. మరోసారి ఆంక్షలను విధించాలని నిర్ణయించాయి. లాక్​డౌన్​ ఇప్పటికీ కొనసాగుతోన్న మరికొన్ని రాష్ట్రాల్లో ఆ తేదీని పొడిగించినట్లు తెలిపాయి.

Reimpose partial lockdowns in Indian States
మినీ లాక్​డౌన్: కరోనా కట్టడికి పలు రాష్ట్రాల నిర్ణయం
author img

By

Published : Jul 12, 2020, 6:42 AM IST

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో.. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు మరోసారి లాక్​డౌన్ విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. కర్ణాటకలోని బెంగళూరు సహా అసోం, అరుణాచల్​ ప్రదేశ్​, మేఘాలయల్లో లాక్​డౌన్​ను విధిస్తున్నట్లు తెలిపాయి అక్కడి ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ కొనసాగుతుండగా.. ఆ తేదీలను మరికొద్ది రోజులపాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

కర్ణాటకలో మళ్లీ..

బెంగళూరు నగరంలో జులై 14 నుంచి వారం రోజులపాటు పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమల్లో ఉంటుదని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకే నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం బీఎస్​ యడియూరప్ప తెలిపారు.

అసోంలో పొడిగింపు..

అసోంలోని గువహటిలో కొనసాగుతోన్న లాక్​డౌన్​ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్​ తెలిపింది. ఈ నిబంధనలు జులై 12 నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించింది. రాష్ట్రంలో 14 రోజుల లాక్​డౌన్​ ఆదివారంతో ముగియనుండగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్​ కృష్ణ తెలిపారు.

అరుణాచల్​ ప్రదేశ్​లో..

అరుణాచల్​ ప్రదేశ్​లో కొవిడ్​ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. జులై 20న ఉదయం 5 గంటల వరకు రాజధాని ఇటానగర్​ ప్రాంతంలో లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని సీఎస్​ నరేశ్​ కుమార్​ తెలిపారు. ముఖ్యమంత్రి పెమా ఖండు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఉత్తరాఖండ్​లో 3 రోజులు..

ఉత్తరాఖండ్​- ఉధమ్​సింగ్​ నగర్​లోని కాశీపుర్​లో శుక్రవారం ఒక్కరోజే 41 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ శనివారం నుంచి మూడు రోజుల పాటు​ పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమల్లోకి రానుంది.

కశ్మీర్​లో అలా..

జమ్ము కశ్మీర్​లో వైరస్​ వ్యాప్తి అధికమవుతోన్న తరుణంలో.. రాజౌరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి కఠిన లాక్​డౌన్​ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. రాజౌరి పరిసర ప్రాంతాలన్నీ మూతపడగా.. ప్రజలు ఇంటివద్ద నుంచి బయటకు రావొద్దని కోరారు అక్కడి అధికారులు.

నాగాలాండ్​లో నెలాఖరు వరకు..

నాగాలాండ్​లో కొనసాగుతోన్న లాక్​డౌన్​ ఈ నెల 16 తో ముగియనుండగా.. జులై 31 వరకు పొడిగించాలని రాష్ట్ర సర్కార్​ నిర్ణయించింది. పెరుగుతోన్న కరోనా వ్యాప్తిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రణాళిక, సమన్వయ మంత్రి నెయిబా క్రోనూ తెలిపారు.

మేఘాలయలో రెండు రోజులు..

మేఘాలయ రాజధాని షిల్లాంగ్​లో సోమవారం నుంచి మరో రెండురోజుల పాటు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం కాన్రాడ్​ సంగ్మా తెలిపారు. కొవిడ్​-19 మార్గదర్శకాలను పాటించడం సహా, పౌరుల ప్రవర్తనలో మార్పులు తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంగ్మా వివరించారు.

బంగాల్​లో మరో వారం..

పశ్చిమ్​ బంగాలో 23 జిల్లాలోని 20 కంటైన్మెంట్​ జోన్​లలో గురువారం నుంచి వారం రోజుల వరకు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఉత్తర్​ప్రదేశ్​లో కర్ఫ్యూ..

యూపీలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ​ అమల్లోకి తెచ్చింది యోగి ప్రభుత్వం. వైరస్​ వ్యాప్తి ప్రాంతాలను గుర్తించేందుకే ఆంక్షలు విధించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్​కే తివారీ తెలిపారు.

మాస్క్​ లేకుండా బయటకు వచ్చిన వారికి నిబంధనల ఉల్లంఘనల కింద రూ.500 జరిమానా విధిస్తామని గౌతమ్​ బుద్ధ్​ నగర్​ పాలనా యంత్రాంగం హెచ్చరించింది.

ఇదీ చదవండి: వజ్రాల మాస్క్​ పెట్టుకోవాల.. ప్రత్యేక ఆకర్షణగా నిలవాల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.