ETV Bharat / bharat

మేక అరెస్ట్- మాస్క్​ లేకపోవడమే కారణం! - మేకను అరెస్టు చేసిన పోలీసులు

మాస్క్​ ధరించలేదని ఓ మేకను అరెస్టు చేసిన విచిత్ర ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జరిగింది. తర్వాత మేక యజమాని వచ్చి విడిచి పెట్టాలని కోరగా దానిని వదిలేశారు.

Kanpur Police
మేక అరెస్ట్- మాస్క్​ లేకపోవడమే కారణం!
author img

By

Published : Jul 27, 2020, 4:41 PM IST

Updated : Jul 27, 2020, 6:35 PM IST

కరోనా కాలంలో ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించటం తప్పని సరి అయ్యింది. మాస్క్​ లేకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు జరిమానా వేస్తున్నారు. మరి కొన్ని చోట్ల జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్​ ​ ధరించకుండా రోడ్డుపై తిరుగుతోందని ఏకంగా ఓ మేకను అరెస్టు చేసిన విచిత్ర ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జరిగింది. ఈ మూగజీవాన్ని జీపులో ఎక్కించుకొని మరీ స్టేషన్​కు తీసుకొని వెళ్లారు.

ఆ యువకుడి వల్లే...

రోడ్డు మీద ఓ యువకుడు మాస్క్​ ధరించకుండా తనతో పాటు మేకను తీసుకువెళ్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. మాస్క్​ ధరించలేదని అడగగానే సదరు వ్యక్తి మేకను అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో ఓ అధికారి మేకను స్టేషన్​కు తీసుకుని వచ్చారు. కాసేపటికి ఆ యువకుడు స్టేషన్​కు వచ్చి మేకను తిరిగి ఇచ్చేయాలని బతిమిలాడాడు. చివరకు పోలీసులు అందుకు ఒప్పుకున్నారు.

మేకకు మాస్క్​లేని కారణంగానే స్టేషన్​కు తీసుకొని వెళ్లినట్లు అధికారి అంగీకరించారు. "ప్రస్తుత తరుణంలో ప్రజలు తాము పెంచుకునే కుక్కకు మాస్క్​ వేసి బయటకు తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు మేకలకు మాస్క్​లు ఎందుకు వేయకూడదు?" అంటూ ఆ అధికారి తన చర్యను సమర్ధించుకున్నారు.

ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Last Updated : Jul 27, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.