ETV Bharat / bharat

ఖననం చేసిన రెండు రోజులకు తిరిగొస్తే... - uttar pardesh dead man came back

ఆత్మీయుల మరణాన్ని ఎవరూ తట్టుకోలేరు. అందుకే, వారు మళ్లీ బతికి వస్తే బాగుంటుందని కోరుకుంటాం. 'ఊరుకోండి మరణించినవారు తిరిగొస్తారా' అంటూ పక్కనున్న వారు ఓదార్చుతుంటారు. కానీ, యూపీ కాన్పూర్​లో చనిపోయి, ఇక రాడనుకున్న ఓ వ్యక్తి తిరిగొచ్చాడు.

kanpur-man-returns-home-two-days-after-family-buried-him
ఖననం చేసిన రెండు రోజులకు తిరిగొచ్చాడు!
author img

By

Published : Aug 9, 2020, 4:20 PM IST

ఉత్తర్ ప్రదేశ్​లో నిర్ఘాంతపోయే ఘటన జరిగింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనుకున్న ఓ వ్యక్తిని పూడ్చిన రెండో రోజే తిరిగొచ్చాడు.

కాన్పూర్ కొలెనెగంజ్​కు చెందిన అహ్మద్ హాసన్.. భార్యతో చిన్న గొడవ జరిగి ఆగస్టు 2న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆగస్టు 5న ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హాసన్ సోదరులు ఆ మృతదేహాన్ని చూసి తమ తమ్ముడే అని బోరున విలపించారు. కుటుంబ సభ్యులంతా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. హాసన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, ఖననం చేసిన రెండో రోజు హాసన్ ఇంటికొచ్చాడు.

kanpur-man-returns-home-two-days-after-family-buried-him
ఖననం చేసిన రెండు రోజులకు తిరిగొచ్చాడు!

"నా భార్యతో గొడవ అయ్యిందని నేను ఇంటి నుంచి వెళ్లిపోయిన మాట నిజమే. కానీ, నాకు ఓ వ్యక్తి సాయం చేసి, ఫ్యాక్టరీలో పని కల్పించాడు. నేను పని చేసుకుని శుక్రవారం ఇంటికి వచ్చాను. కానీ, మా ఇంటికి తాళం వేసి ఉంది. మా ఇరుగుపొరుగు నన్ను చూసి, కంగారుపడి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పుడే నాకు తెలిసింది.. నేను చనిపోయాను అనుకుని నా కుటుంబ సభ్యులు వేరే ఎవరికో అంత్యక్రియలు నిర్వహించారని."

-అహ్మద్ హాసన్

అచ్చం హాసన్ ముఖాన్ని పోలి ఉండడం వల్లే తాము పొరబడ్డామని, మరొకరికి అంత్యక్రియలు నిర్వహిచామని అంటున్నారు కుటుంబ సభ్యులు.

"మా ఆయనతో చిన్న గొడవ జరిగింది. అంత మాత్రానికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకు ఓ శవాన్ని చూపించి గుర్తు పట్టమన్నారు. ఆ మృతదేహం ముఖం కాస్త మా ఆయన ముఖంలానే ఉంది. అయినా, నాకు అనుమానంగానే ఉంది. కానీ, మా ఆయన సోదరులు.. చనిపోయింది మా ఆయనే అని బలంగా చెప్పారు. దీంతో, ఆ మృతదేహానికే అంత్యక్రియలు నిర్వహించాం. మా ఆయన తిరిగొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "

-హాసన్ భార్య

హాసన్ అయితే తిరిగొచ్చాడు కానీ, అతడిలాగే కనిపించిన ఆ మృతదేహం ఎవరిదో కనిపెట్టడం ఇప్పుడు పెద్ద సవాలు అన్నారు స్థానిక ఎస్పీ ప్రీతిందర్ సింగ్.

ఇదీ చదవండి: ఇక సైకిల్​తో పాటు బస్సు ఎక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.