పోలీసు కాల్పుల్లో హతమైన కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దుబేకు చెందిన ఇద్దరు అనుచరులను మహారాష్ట్ర ఠాణెలో ఉగ్రవాద వ్యతిరేక దళ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను హతమార్చిన ఘటనలో వీరు కూడా నిందితులని తెలిపారు.
![Kanpur killing of cops: 2 aides of Vikas Dubey held in Thane](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7984425_k.png)
వీరిలో ఒకరు అరవింద్ అలియాస్ త్రివేది అని, మరొకరు అతని డ్రైవర్ సోను తివారీగా గుర్తించారు. 2001లో ఉత్తర్ప్రదేశ్ మాజీ మంత్రి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఒకటే వేదిక.. వరుడొక్కడు.. వధువులిద్దరు!