ETV Bharat / bharat

'దూబే'కు సమాచారం లీక్​ చేసిన పోలీసుల అరెస్ట్​ - Vikas Dubey case latest update

కాన్పుర్​ ఎన్​కౌంటర్​ ఘటనలో ఇద్దరు పోలీసులను అరెస్ట్​ చేశారు అధికారులు. దూబేకు ముందే సమాచారం ఇవ్వడం, ఎన్​కౌంటర్​ స్థలం నుంచి పారిపోయిన కేసులో భాగంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హరియాణా ఫరీదాబాద్​లో ఉన్న దూబే అనుచరుల్లో ముగ్గురిని అరెస్ట్​ చేశారు.

Kanpur encounter
'దూబే'కు సమాచారం లీక్​ చేసిన ఇద్దరు పోలీసుల అరెస్ట్​
author img

By

Published : Jul 8, 2020, 10:10 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నింధితుడు, ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారకుడైన రౌడీషీటర్​ వికాస్​ దూబే కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. దూబేను పట్టుకోవడం కోసం వెళ్లే క్రమంలో అతనికి ముందే సమాచారం అందించిన వ్యవహారంలో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్ట్​ చేశారు.

చౌబేపూర్‌ పోలీసుస్టేషన్‌ అధికారి వినయ్‌ తివారీ, బిక్రూ ప్రాంత బీట్‌ ఇన్‌ఛార్జ్‌ కేకే శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకపై సమాచారాన్ని ముందే లీక్‌ చేయడం సహా, సహచర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి ఎన్‌కౌంటర్‌ సమయంలో ఘటనా స్ధలం నుంచి పారిపోయిన కేసు కింద వీరిద్దరిని అరెస్టు చేశారు.

ఎన్​కౌంటర్​ స్థలం నుంచి పారిపోవడంపై చౌబేపూర్​ పోలీస్​ స్టేషన్​లో తివారీ, శర్మలపై మరో ఎఫ్​ఐఆర్​ నమోదైంది.

ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరమే ఈ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేశారు అధికారులు. తాజాగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరో ముగ్గురు అరెస్ట్​..

దూబే కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్​లో దూబే ఉన్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో తనిఖీ చేయగా.. ముగ్గురు పట్టుబడ్డారు. వారిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

Kanpur encounter
ముగ్గురి అరెస్ట్​

దూబే భార్యకు నోటీసులు..

లఖ్​నవూ అభివృద్ధి సంస్థ (ఎల్​డీఏ) దూబే ఇంటికి నోటీసులు జారీ చేసింది. దూబే భార్య రిచా దూబే.. ఇంటి మ్యాప్​తో ఎల్​డీఏ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది.

Kanpur encounter
దూబే ఇంటికి నోటీసులు అంటించిన ఎల్​డీఏ

భారీగా ఆయుధాలు..

ఉత్తర్​ప్రదేశ్​లోని ఖండ్వా ప్రాంతంలో ఇవాళ నలుగురు దుండగులను పట్టుకున్నారు ఎస్​టీఎఫ్​ సిబ్బంది. వారి వద్ద నుంచి 14 పిస్టల్స్​, 9 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఖండ్వా మీదుగా యూపీ నుంచి వేరే రాష్ట్రానికి పారిపోతున్న క్రమంలో వారి వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. కాన్పుర్​ ఎన్​కౌంటర్​ నిందితుడు, రౌడీషీటర్​ వికాస్​ దూబేతో వీరికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.

Kanpur encounter
నలుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

ఇవీ చూడండి: దూబే డెన్​పై​ దాడి సమాచారం పోలీసుల నుంచే లీక్

ఎన్​కౌంటర్​లో 'దూబే' ప్రధాన అనుచరుడు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.