ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని ఓ ప్రభుత్వ శిశు వసతి గృహంలో 57 మందికి కరోనా సోకింది. వైరస్ సోకిన వారిలో ఐదుగురు బాలికలు గర్భంతో ఉన్నట్లు పాలనాధికారి తెలిపారు. అక్కడ మొత్తం ఏడుగురు అమ్మాయిలు గర్భంతో ఉండగా.. మిగతా ఇద్దరికి వైరస్ నెగెటివ్‌గా తేలింది.
వైరస్ నిర్ధరణ అయిన ఐదుగురు అమ్మాయిలు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పోక్సోచట్టం కింద వసతి గృహంలో చేరారని అక్కడి శిశు సంక్షేమ కమిటీలు పేర్కొన్నాయి. అయితే ఏడుగురు బాలికలూ గర్భంతోనే తమ ఆశ్రమంలో చేరినట్లు వసతి గృహ అధికారి తెలిపారు.
ప్రియాంక విమర్శలు..
కాన్పూర్ వసతి గృహంలో గర్భం దాల్చిన బాలికలు ఉన్నట్లు వార్తలు రావడం వల్ల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా యూపీ ప్రభుత్వంపై ఫేస్బుక్ వేదికగా విమర్శలు గుప్పించారు.
'ముజఫర్‌పుర్‌లో కూడా ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయి. బాలికలు గర్భం దాల్చిన ఘటనలపై ఎన్నో కేసులు వస్తున్నప్పటికీ.. దర్యాప్తు సక్రమంగా జరగడం లేదు. అయితే ఇలాంటి దారుణాలు పిల్లలకు రక్షణ కల్పించే చోటే ఎక్కువ నమోదవుతున్నాయి.'
- ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్ నాయకురాలు
ఇదీ చదవండి: కుదుటపడ్డ ధారావి.. తగ్గిన వైరస్ వ్యాప్తి