ETV Bharat / state

ఏం గుండెరా సామి నీది.. 10 వేల పాములు పట్టి రికార్డు - SPECIAL STORY WITH SNAKE CATCHER

ఎలక్ట్రీషియన్‌ వృత్తి చేస్తూనే పాములు పట్టడం నేర్చుకున్న జయకర్‌ - ఇప్పటి వరకూ ఏకంగా పదివేల పాములను పట్టిన రికార్డు

Snake Catcher Jayakar Special Story
Special Story With Snake Catcher Jayakar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 7:57 AM IST

Snake Catcher Special Story : పాములను చూస్తే చాలు భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ హనుమకొండకు చెందిన పుట్టా జయకర్ మాత్రం భయపడడు సరికదా వాటిని అవలీలగా పట్టేస్తాడు. పామొచ్చిందని ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వెంటనే వచ్చి ఆ పామును పట్టేస్తాడు. ఇలా పట్టిన వాటికి ఏమాత్రం హాని చేయకుండా దూరంగా అడువుల్లో వదిలేస్తాడు. అలా వేలాది పాములు పట్టి రికార్డు నెలకొల్పాడు.

ఏ పామునైనా ఇట్టే పట్టేయడం వెన్నతో పెట్టిన విద్య : హనుమకొండ జిల్లా సుబ్బయ్యపల్లికి చెందిన జయకర్‌ వృత్తి ఎలక్ట్రీషియన్. అప్పుడప్పుడు మేజిషియన్‌గా మారి ప్రదర్శనలు ఇస్తారు. కానీ ప్రవృత్తి మాత్రం ఇదిగో ఇదే. ఏ పామునైనా ఇట్టే పట్టేయడం జయకర్ వెన్నతో పెట్టిన విద్యే. పట్టేటప్పుడు చాలా నేర్పుగా వాటికి ఎలాంటి గాయం కాకుండా చూస్తారు. ఓసారి కొందరు పామును పట్టి చంపేయడం చూసి ఆవేదన చెంది తనకు తాను.. సొంతంగా పాములను పట్టడం నేర్చుకున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు. ఇక అప్పటి నుంచి పాములు పట్టడం మొదలుపెట్టారు.

ఇళ్లల్లోకి, ఇంటి ఆవరణలోకి పాములు రావడం సహజమే. ఇలా వచ్చినవారంతా జయకర్‌కు ఫోన్ చేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి వచ్చి పాములు పట్టేస్తాడు. ఇలా పట్టినందుకు రూపాయి కూడా డిమాండ్ చేయడు. ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటి వరకు వేలాది పాములను పట్టాడు. సామాన్యుల ఇళ్లలోనే కాదు వీఐపీల ఇళ్లల్లోనూ వందల సంఖ్యలో సర్పాలను పట్టేశాడు.

పాములు పట్టే క్రమంలో పలుమార్లు అవి కాటేసినా భయపడడం కానీ ఆ పని మానేయడం కానీ చేయలేదు జయకర్‌. అంతేకాదు పాములు హానికరం కాదని మానవాళికి ఎంతో ఉపయోగం చేస్తాయని వాటిని చంపకూడదంటూ అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తాడు. పాములు పగబట్టడం మూఢనమ్మకమేనని పాములు పాలు తాగుతాయనడంలోనూ అర్ధం లేదని చెపుతూ జనంలో భయం పొగొట్టేందుకు కృషి చేస్తున్నాడు. మూఢ నమ్మకాలను పారద్రోలుతున్నందుకు గుర్తింపుగా పురస్కారాలు కూడా దక్కాయి.

చెట్లు కొట్టేయడం అటవీ ప్రాంతం క్రమేపీ తగ్గిపోతుండడంతో పాములు మనం నివసించే వైపు వస్తున్నాయని చెపుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అవి నివసించే చోటుకు మనం వెళ్తున్నాం తప్ప మనం ఉన్న చోటుకి అవి రావట్లేదని జయకర్​ అంటున్నారు. అన్ని పాములు హానిచేయవన్నది తెలుసుకోవాలని కానీ పాములు పట్టేటప్పుడు మాత్రం కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని జయకర్​ జాగ్రత్తలు చెబుతున్నారు.

డోర్​ కర్టెన్​ పైపుపై ఎక్కి కోబ్రా బుసలు- ఇంట్లోకి ప్రవేశించి నాగుపాము హల్​చల్​ - Cobra Entered In House

వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ పాములు తిరుగుతుంటాయ్ - కాటేస్తే వెంటనే ఇలా చేయండి! - Immediate Precautions to Snake Bite

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.