Indians Evacuated From Syria : సిరియాలో నెలకొన్న పరిస్థితుల మధ్య అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
The Government of India today evacuated 75 Indian nationals from Syria, following recent developments in that country. All Indian nationals have safely crossed over to Lebanon and will return by available commercial flights to India. The evacuation, coordinated by the embassies… https://t.co/DRBm16OtcD pic.twitter.com/JnhwmPdNY7
— ANI (@ANI) December 10, 2024
మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్ (యాత్రికులు)లు ఉన్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. వారంతా సిరియా సరిహద్దులు దాటి క్షేమంగా లెబనాన్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు తెలిపింది. ఇంకా అనేక మంది భారతీయులు సిరియాలో ఉన్నారని వెల్లడించింది. వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది.
" all 75 indian nationals evacuated from syria including 44 ‘zaireen’ from jammu & kashmir who were stranded at saida zainab, have now reached beirut. ambassador @NoorRahman_IFS
— Press Trust of India (@PTI_News) December 11, 2024
received them upon their arrival in Beirut. They will return by available commercial flights to India,"… pic.twitter.com/kPcPJIWqbC
సాయుధ తిరుగుబాటుదారుల సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియాను వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇక, అసద్ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ రెబల్స్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.