కర్ణాటక స్పీకర్‌ను ఆ రాష్ట్ర శాసనసభ్యులు నేడు ఎన్నుకోనున్నారు. సభాపతిగా భాజపా నేత విశ్వేశ్వర్ హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నిర్ణీత గడువులోగా హెగ్డే మినహా స్పీకర్ పదవికి వేరే నామినేషన్లు రాకపోవడమే ఇందుకు కారణం.
అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, విశ్వాస పరీక్షలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓడిపోవడం వల్ల కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది. సోమవారం ముఖ్యమంత్రి యడియూరప్ప అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు. అనంతరం స్పీకర్ పదవికి రమేశ్ కుమార్ రాజీనామా చేశారు. సభలో భాజపాకు అధిక మెజారిటీ ఉన్నందున స్పీకర్ పదవి రేసు నుంచి కాంగ్రెస్, జేడీఎస్ తప్పుకున్నాయి.
ఎమ్మెల్యేల బహిష్కరణ...
కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన 14 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్.
ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ మాజీ సభాపతి రమేశ్ కుమార్ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిచేసింది: మోదీ