కేసులను వేగంగా పరిష్కరించే క్రమంలో న్యాయం సమాధి కాకుండా చూడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
"క్రిమినల్ నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించడం నిస్సందేహంగా అవసరమే. అయితే ఇందుకోసం కేసుల విషయంలో నిష్పాక్షికతను, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఉన్న అవకాశాలను ఫణంగా పెట్టకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయం బలి కారాదు."
- సుప్రీం కోర్టు
2013లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేందుకు అర్హమైన అన్ని కేసుల్లోనూ కోర్టు సహాయకులుగా న్యాయవాదులను నియమించేందుకు వారికి కనీసం 10ఏళ్ల పాటు కోర్టులో ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలంది.
ఇదీ చూడండి: 'పౌర చట్టం, ఎన్ఆర్సీతో పేదలకే ఎక్కువ నష్టం'