సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి కోర్టులో స్పృహ కోల్పోయారు. నిర్భయ దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చదువుతూ ఆమె అస్వస్థతకు గురయ్యారు.
అయితే వెంటనే ఆమె స్పృహలోకి రాగా.. ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ప్రాథమిక చికిత్సకోసం చక్రాల కుర్చీపై ఆమెను ఛాంబర్‌కు తీసుకువెళ్లారు.
అయితే ఈ పిటిషన్‌పై తీర్పును ఛాంబర్లో తెలుపుతామని జస్టిస్ ఏస్ఏ బోపన్న వెల్లడించారు.
తీవ్ర జ్వరం...
జస్టిస్ ఆర్ భానుమతి ఆరోగ్య పరిస్థితి గురించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
"జస్టిస్ ఆర్ భానుమతి తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఛాంబర్లో ఆమెను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కేసు విచారణ సమయంలోనూ ఆమె జ్వరానికి మందులు వేసుకున్నారు" - తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్