ఈశాన్య దిల్లీలో గత కొద్ది రోజులుగా చెలరేగిన అల్లర్లపై వాదనలు వింటున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్ బదిలీ అయ్యారు. పంజాబ్, హరియాణా హైకోర్టుకు ఆయనను బదిలీ చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు జస్టిస్ మురళీధర్ బదిలీ అయినట్లు తెలుస్తోంది. అయితే పంజాబ్, హరియాణా హైకోర్టులో ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారన్న విషయంలో స్పష్టత లేదు.
విద్వేష ప్రసంగాలపై ప్రశ్న
అల్లర్లపై వాదనలు వింటున్న ధర్మాసనానికి జస్టిస్ మురళీధర్ నేతృత్వం వహిస్తున్నారు. విచారణలో భాగంగా... విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన భాజపా నేతలపై కేసులు నమోదు చేయకపోవడం పట్ల పోలీసులపై విస్మయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'ఆ మంటల్లో పడి మీరు చావలేదుగా'