బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం నిలిచిపోయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు ఆదివారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు లేక బోగీలన్నీ వెలవెలబోయాయి. స్లీపర్ క్లాస్ బోగీల్లో 10 మంది, ఏసీ కోచ్‌లో ప్రయాణించేందుకు ఇద్దరు టికెట్లను బుక్ చేసుకున్నారు. వీరంతా పాకిస్థాన్‌కు చెందిన వారే. వారు మాత్రమే ప్రయాణించారు.
భద్రతా కారణాల దృష్ట్యా డాగ్ స్క్వాడ్‌తో రైలులో ముమ్మర తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది.
సంఝౌతా చివరిసారి అటారీ వెళ్లినప్పుడు 27 మంది ప్రయాణించారు. వారిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు.