ETV Bharat / bharat

డీఎంకే-కాంగ్రెస్​ విజయం తథ్యం: అయ్యర్ - కాంగ్రెస్ జంబో కమిటీలు మణిశంకర్ అయ్యర్

తమిళనాడులో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జంబో కమిటీల వల్ల ప్రతికూలతలు ఉండవని ఆ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి సునాయాస విజయం సాధిస్తుందని అన్నారు.

Jumbo committees will not adversely impact Cong in TN; bring various factions together: Aiyar
'జంబో కమిటీలు కాంగ్రెస్​కు ప్రతికూలం కాదు'
author img

By

Published : Jan 7, 2021, 6:28 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పోల్​ ప్యానెళ్ల వల్ల ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. వీటి వల్ల అన్ని వర్గాలు ఒక్కచోటుకు చేరుతాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేపై కాంగ్రెస్-డీఎంకే కూటమి సునాయాస విజయాన్ని అందుకుంటుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీలపై ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్యానెళ్లను జంబో కమిటీలుగా పేర్కొంటూ.. వాటి వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. కమిటీలో ఎవరికీ అధికారం లేదని, కాబట్టి జవాబుదారీతనం కూడా ఉండదని చెప్పుకొచ్చారు.

తాజాగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) వార్తా సంస్థకు ముఖాముఖి ఇచ్చిన అయ్యర్.. కార్తీ వాదనను తోసిపుచ్చారు.

"జంబో విధానం అనేది పార్టీలోని అగ్రనాయకత్వంలో ఉన్న అభిప్రాయభేదాలను తొలగించడానికే. ఈ విధానం తిరగబడుతుందని నేను భావించడం లేదు. ఈ కమిటీలలోని సభ్యులు చిన్నచిన్న బృందాలుగా ఏర్పడి నిర్ణయాలు తీసుకోవాలి. దీని వల్ల పార్టీ నేతలు ఏకతాటిపైకి వస్తారు. పార్టీలో వర్గాలు ఉన్నాయి, వాటిని గుర్తించడమే ఉత్తమం. జంబో కమిటీల వల్ల ప్రతి వర్గం వారు తమకు ప్రాతినిధ్యం ఉందని గుర్తిస్తారు. ఇది కాంగ్రెస్​కు ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అనుకోవట్లేదు."

-మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నాడీఎంకేలో పళనిస్వామి, పనీర్​సెల్వం మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని, అలాంటి పార్టీతో కాంగ్రెస్-డీఎంకే పోటీపడుతోందని అన్నారు అయ్యర్. తమ విజయం నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేశారు. భాజపాతో అన్నాడీఎంకే చేతులు కలిపితే ఆ పార్టీపై ప్రతికూల ప్రభావమే పడుతుందని అన్నారు.

ఎప్పటిలాగే వచ్చే ఎన్నికల్లోనూ సుపరిపాలన అంశంపైనే పోరాడతామని పేర్కొన్నారు అయ్యర్. సైద్ధాంతిక పరంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య తేడాలు లేవని అన్నారు. రాష్ట్రంలో భాజపా రాజకీయంగా మరింత బలపడితే ఈ సమస్య తలెత్తేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే పోటీ ఉంటుందన్నారు. ప్రజలకు ఉన్న మూడో ప్రత్యామ్నాయం గత రెండేళ్లలో తుడిచిపెట్టుకుపోయిందని కమల్, రజినీని ఉద్దేశించి పేర్కొన్నారు. తమిళనాడులో ఐదేళ్లు అన్నాడీఎంకే పాలన కొనసాగిందని, వారి ప్రదర్శన ఎన్నికల్లో గెలిచేందుకు సరిపోదని అన్నారు.

ఇదీ చదవండి: తమిళనాట ఎన్నికల వేడి- కాంగ్రెస్​కు చావోరేవో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.