ETV Bharat / bharat

బెంగాల్ జూడాలకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు

పశ్చిమ బంగలో వైద్యుల ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఎస్​ఎస్​కేఎం వైద్య కళాశాల విద్యార్థిపై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పలు రాష్ట్రాల్లోని వైద్య విద్యార్థులు తలకు బ్యాండేజీలు వేసుకుని నిరసన ర్యాలీలు చేపట్టారు.

జూడాల సమ్మె
author img

By

Published : Jun 14, 2019, 1:30 PM IST

Updated : Jun 14, 2019, 1:55 PM IST

దేశ వ్యాప్తంగా జూడాల ఆందోళనలు

బంగాల్​లో వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా చేపడుతున్న సమ్మెకు దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు మద్దతు తెలిపాయి. దిల్లీ ఎయిమ్స్​తో పాటు పలు రాష్ట్రాల్లోని వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగాల్​లో జూడాల సమ్మె నేటితో నాలుగో రోజుకు చేరుకుంది.

వైద్య సంఘాల నిరసనలు

  • దిల్లీ ఎయిమ్స్ వైద్యులు తలకు కట్టుతో ఆందోళన బాట పట్టారు. బంగాల్​లో దాడికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆసుపత్రి ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. స్థానిక వైద్యుల సంఘం (ఆర్​డీఏ) సమ్మెతో ఓపీడీ వద్ద పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సఫ్దర్​జంగ్​ ఆసుపత్రి వైద్యులూ బెంగాల్​ జూడాలకు మద్దతు పలికారు.
  • మహారాష్ట్రలో నాగ్​పుర్​ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తలకు బ్యాండేజీతో రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యులను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
  • ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​ డాక్టర్​ భీంరావ్​ అంబేడ్కర్​ మెమోరియల్​ ఆసుపత్రి వైద్యులు విధులను బహిష్కరించారు. న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు.
  • రాజస్థాన్​ జైపుర్​లోని జైపూరియా ఆసుపత్రి వైద్యులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
  • కేరళ త్రివేండ్రంలో భారత వైద్య సంఘం సభ్యులు ఆందోళనలకు దిగారు.

సీఎం హెచ్చరించినా...

విధుల్లో చేరాలని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించినా వైద్యులు ఖాతరు చేయలేదు. నాలుగు రోజుల పాటు కొనసాగుతున్న సమ్మెతో వైద్యసేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై దాడి జరిగిన కారణంగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: బంగాల్​ ఉద్రిక్తతల వెనుక హోంమంత్రి: మమత

Intro:Body:

opop

Conclusion:
Last Updated : Jun 14, 2019, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.