ETV Bharat / bharat

యూపీ ఉప్పు-రొట్టె వీడియో తీసిన జర్నలిస్ట్​పై కేసు - కేసు

ఉత్తర్​ప్రదేశ్​లో సర్కారు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పోషకాహారం బదులుగా రొట్టె ఉప్పుతో సరిపెట్టిన దృశ్యాలు వైరల్​ అయ్యాయి. ఈ వీడియో రికార్డు చేసిన జర్నలిస్టు పవన్​కుమార్ జైస్వాల్​పై రాష్ట్ర పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ఉప్పు, రొట్టె వార్త రాసిన జర్నలిస్ట్ అరెస్ట్
author img

By

Published : Sep 3, 2019, 1:33 PM IST

Updated : Sep 29, 2019, 6:58 AM IST

కొద్దివారాల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు రొట్టెలు, కూరతో కూడిన పోషకాహారానికి బదులుగా రొట్టెలు-ఉప్పు అందించారు. ఈ వీడియో చిత్రీకరించిన స్థానిక జర్నలిస్టు జైస్వాల్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

వార్త రాసిన జర్నలిస్టు రాష్ట్ర ప్రభుత్వ కీర్తిని అప్రతిష్టపాలు చెయ్యడానికి అసత్య ప్రచారం చేశారని స్థానిక అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జైస్వాల్​పై ఫిర్యాదు

​జర్నలిస్ట్​ పవన్​ జైస్వాల్​పై స్థానిక కలెక్టర్ ఆదేశాలమేరకు మీర్జాపూర్​ బ్లాక్​ విద్యాశాఖాధికారి ప్రేమ్ శంకర్​ రామ్.. అరూరా పోలిస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. షియుర్​ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో రొట్టెలను వండారని... కానీ అందులోకి కూరలు వండలేదని, కావాల్సిన ఏర్పాట్లు చెయ్యాల్సింది మానేసి గ్రామ సర్పంచ్ అనుచరుడు రాజ్​కుమార్​ పాల్​... జర్నలిస్ట్​ పవన్​ను పిలిపించి కుట్రపూరితంగా వీడియో తీయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి జైస్వాల్‌పై నేరపూరిత కుట్ర, మోసం కింద పవన్ కేసు నమోదు చేశారు.

వార్త సృష్టించింది కాదు

ఈ వార్త ఉద్దేశపూర్వకంగా తీసింది కాదని, ఒకసారి వార్తను చూసి నిర్ధరణ చేసుకోవాలని జైస్వాల్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రతి విషయాన్ని అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

వీడియోలో ఏముంది?

పాఠశాలలోని పిల్లలు రొట్టెలో కూరగాయలకు బదులుగా ఉప్పును వేసుకుని తింటున్న దృశ్యాలను పవన్​ వీడియో తీశారు. ఇటీవల ఆగస్టు 22న ఈ ఘటన జరిగింది. వీడియో కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. నెటిజన్లు, మీడియా నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పోషకాహారం లభించడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయంపై స్పందించింది. మధ్యాహ్న భోజన పథకంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర కార్యదర్శికి నోటీసు పంపింది.

భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం

జర్నలిస్టుపై ఎఫ్​ఐఆర్​ నమోదు చెయ్యడాన్ని ఖండిస్తూ, ఇలాంటి చర్యలు పాత్రికేయ స్వేచ్ఛపై దాడి చేసినట్లేనని సమాజ్​వాదీ పార్టీ ఆరోపించింది. భారతదేశంలో ప్రతిఒక్కరికీ సమానమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని సమాజ్​వాద్​ పార్టీ అధినేత అఖిలేష్​ యాదవ్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

కేసు సరికాదన్న విద్యామంత్రి

జైస్వాల్​పై కేసు నమోదు చేసిన ఘటన పట్ల ఉత్తరప్రదేశ్​ ప్రాథమిక విద్యా మంత్రి సతీష్​ ద్వివేది స్పందించారు. వాస్తవాలు, అవినీతిని బైటపెట్టే జర్నలిస్టుపై కేసు పెట్టడం సరికాదన్నారు. కేసు ఏ ప్రాతిపదికపైన పెట్టారో స్థానిక ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకుని స్పందిస్తామన్నారు.

ఇదీ చూడండి:దిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Pyongyang, DPRK - Sept 2, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese State Councilor and Foreign Minister Wang Yi shaking hands with Foreign Minister Ri Yong Ho of Democratic People's Republic of Korea (DPRK)
2. Various of Wang holding talks with Ri
Visiting Chinese State Councilor and Foreign Minister Wang Yi held talks with Foreign Minister Ri Yong Ho of the Democratic People's Republic of Korea (DPRK) in Pyongyang on Monday, to discuss relations between their two countries and other issues of common concern.
At the talks, Wang said effectively maintaining, consolidating and developing the friendly cooperation between China and the DPRK is an unswerving policy of the Chinese government, and that the Chinese side is willing to work with the DPRK to implement the important consensus reached by General Secretary Xi Jinping and Chairman Kim Jong Un in a fast and all-round manner, so as to well hold activities to celebrate the 70th anniversary of the establishment of diplomatic relations between the two countries, advance friendly exchange and pragmatic cooperation, and enhance communication and cooperation on the international arena.
Speaking on the same occasion, Ri said the Korean Workers' Party and state of the DPRK will always firmly promote the friendship and cooperation with China, noting that the DPRK is willing to work with China to grandly celebrate the 70th anniversary of the establishment of diplomatic relations and further develop bilateral ties in a new era.
The DPRK foreign minister also reiterated that Hong Kong is part of China, and external forces should not interfere in China's internal affairs.
The two sides also carried out in-depth exchanges on the situation of the Korean Peninsula, and agreed to keep close contact in this regard so as to make greater contribution to peace and stability of the region.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.