ETV Bharat / bharat

జేఎన్​యూ: ఫీజుల పెంపుపై నిరసనలు ఉద్రిక్తం - JNU PROTESTS

నిరసనలతో దిల్లీ జేఎన్​యూ మరోమారు వార్తల్లో నిలిచింది. ఫీజుల పెంపుపై ఆగ్రహించిన విద్యార్థులు... విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి జేఎన్​యూ వెళ్లిన కేంద్రమంత్రి రమేశ్​ పోఖ్రియాల్​... దాదాపు 6 గంటల పాటు అక్కడే చిక్కుకుపోయారు.

జేఎన్​యూ: ఫీజుల పెంపుపై నిరసనలతో ఉద్రిక్తం
author img

By

Published : Nov 11, 2019, 6:04 PM IST

Updated : Nov 11, 2019, 8:12 PM IST

జేఎన్​యూ: ఫీజుల పెంపుపై నిరసనలు ఉద్రిక్తం

దిల్లీలోని జవహర్​లాల్​ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పెంచిన ఫీజులకు నిరసనగా.. జేఎన్​యూ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడం వల్ల ప్రాంగణమంతా హోరెత్తింది. వేల మంది విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.

ఫీజుల పెంపుపై తమతో మాట్లాడటానికి వైస్​ ఛాన్సలర్​ సిద్ధంగా లేరని విద్యార్థులు వెల్లడించారు. యాజమాన్యం ప్రవర్తన వల్ల తమకు నిరసనలు చేయడం తప్ప వేరే మార్గం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

"వైస్​ ఛాన్సలర్​, హాస్టల్​ యాజమాన్యం సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇది ఎంతో దారుణంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఫీజును 999.9శాతం పెంచారు. డ్రెస్​ కోడ్స్​, కర్ఫ్యూ సమయాలను అమలు చేయాలని చూస్తున్నారు. మా నిరసనలకు ఇవే కారణం. జేఎన్​యూ వ్యవస్థపై దాడి జరుగుతోంది. ఇందులో వైస్​ ఛాన్సలర్​ పాత్ర కూడా ఉంది. నిరసనలు చేపట్టడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ఫీజు పెరిగితే విద్యా వ్యవస్థ ఓ వస్తువులా మారిపోతుంది. 40 శాతం మంది చదువులు ఆపేయాల్సి వస్తుంది. మిగిలిన విద్యార్థులపై ఆర్థిక భారం ప్రతియేటా చాలా పెరుగుతుంది. ఆందోళనలు అత్యవసరం. మా వైస్ ​ఛాన్సలర్​ విద్యార్థి సంఘాలతో మాట్లాడటానికి సిద్ధంగా లేరు."

-- జేఎన్​యూ విద్యార్థి.

హాస్టల్​లోని సింగిల్​ రూమ్​ ధర రూ. 10 నుంచి 300కు, డబుల్​ రూమ్​ ధర రూ.20 నుంచి 600, మెస్​ డిపాజిట్​ ధర రూ. 5,500 నుంచి 12వేలకు పెంచారని విద్యార్థులు చెబుతున్నారు.

జేఎన్​యూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరైన సమయంలో విద్యార్థులు ఆందోళనకు దిగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

మంత్రికి నిరసన సెగ...

జేఎన్​యూలోని ఓ వేడుకకు హాజరైన కేంద్రమంత్రి రమేశ్​ పోఖ్రియాల్​... విద్యార్థుల నిరసనల వల్ల దాదాపు 6 గంటల పాటు ఆడిటోరియంలోనే చిక్కుకుపోయారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడితో మాట్లాడిన రమేశ్​.. సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో జేఎన్​యూ నుంచి పోలీసులు సురక్షితంగా పోఖ్రియాల్​ను బయటకు తీసుకొచ్చారు. మంత్రి హాజరవ్వాల్సిన వేడుకలు రద్దయ్యాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
The Hague - 11 November 2019
1. Exterior of the International Court of Justice (ICJ)
2. Delegation of Gambia and Organisation of Islamic Cooperation
3. Various of Gambia's Attorney General and Minister of Justice, Abubacarr Marie Tambadou, and US lawyer Paul Reichler
4. UN flag
5. Various of the delegation in front to the ICJ
6 . Exterior of the ICJ
7. Mid of Tambadou with others
8. SOUNDBITE (English) Abubacarr Marie Tambadou, Gambia's Attorney General and Minister of Justice:
"Well, we have filed the case this morning. And what we are seeking to do by this filing is to get Myanmar to account for its actions against its own people, the Rohingya, to ensure that the International Court of Justice does justice to the case and to the cause of the Rohingya. And The Gambia, which is bringing this case on behalf of the Organization of Islamic Cooperation, wants to send a clear message to Myanmar and to the rest of the international community that the world must not stand by and do nothing in the face of terrible atrocities that are occurring around us. It is a shame for our generation that we do nothing while genocide is unfolding right before our own eyes. And so we are sending a message that it doesn't take a country with economic or military power to speak out and speak up against injustice anywhere on the world. That's the message I have."
9. Mid of minister
STORYLINE:
Gambia filed a case on Monday at the United Nations' highest court accusing Myanmar of genocide in its campaign against the Rohingya Muslim minority.
Lawyers for Gambia said in a statement that the case also asks the International Court of Justice to urgently order measures "to stop Myanmar's genocidal conduct immediately".
Gambia filed the case on behalf of the Organization of Islamic Cooperation.
The country's Justice Minister and Attorney General, Abubacarr Marie Tambadou, said he wanted to "send a clear message to Myanmar and to the rest of the international community that the world must not stand by and do nothing in the face of terrible atrocities that are occurring around us".
Myanmar's military began a harsh counterinsurgency campaign against the Rohingya in August 2017 in response to an insurgent attack.
More than 700,000 Rohingya fled to neighbouring Bangladesh to escape what has been called an ethnic cleansing campaign involving mass rapes, killings and burning of their homes.
The head of a UN fact-finding mission on Myanmar warned last month that "there is a serious risk of genocide recurring".
The mission also said in its final report in September that Myanmar should be held responsible in international legal forums for alleged genocide against the Rohingya.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 11, 2019, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.