జమ్ముకశ్మీర్లో ఆగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించే ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
రాష్ట్రపతి ఆమోదం తర్వాత తుది ఉత్తర్వులను జారీ కానున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉంది.