ETV Bharat / bharat

నోట్ల మార్పిడికి పాల్పడ్డ ఆరుగురిపై సీబీఐ కేసు - ఘజియాబాద్ జమ్ముకశ్మీర్​ బ్యాంక్​

రద్దు చేసిన నోట్లను చలామణిలో ఉన్న సొమ్ములోకి మార్చేందుకు యత్నించిన ఆరుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంక్​ మేనేజరు సహకారంతో రూ. 12.84కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది సీబీఐ.

jk bank fraud, cbi
నోట్ల మార్పిడికి పాల్పడ్డ ఆరుగురిపై సీబీఐ కేసు నమోదు
author img

By

Published : Jan 13, 2021, 10:53 PM IST

రద్దు అయిన నోట్లను చలామణిలో ఉన్న సొమ్ముకు మార్చేందుకు ప్రయత్నించి మోసానికి పాల్పడిన ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్​ మేనేజర్​తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ మొత్తం సొమ్ము రూ. 12.84కోట్లు అని ఎఫ్​ఐఆర్​లో పేర్కొంది.

ఎగ్జిక్యూటివ్​ మేనేజర్​తో బంధం..

ఈ వ్యవహారంపై గతేడాది డిసెంబర్​ 10న సమాచారం అందుకుంది సీబీఐ. జమ్ముకశ్మీర్​ బ్యాంక్​కు చెందిన ఘజియాబాద్​ బ్రాంచ్​లో రాహుల్​ చౌదరీ, దుష్యంత్​ చౌదరిలు.. మూడు కంపెనీ(శివ ట్రేడింగ్​ కంపెనీ, దివ్యాంషి సేల్స్​ కార్పరేషన్​, శ్యామ్​ ట్రేడింగ్​ కంపెనీ)ల అకౌంట్లను నిర్వహిస్తున్నట్టు తెలుసుకుంది.

ఎగ్జిక్యూటివ్​ మేనేజర్​ నేతర్​ సభర్వార్​తో ఉన్న అనుబంధంతో.. సంస్థల ప్రొప్రైయిటర్ల బదులు, వీళ్లే అకౌంట్లను నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎగ్జిక్యూటివ్​ మేనేజర్​ కూడా వారికి సహాయం చేశారు. కంపెనీ ఖాతాల్లో ఫోన్​ నెంబర్లు మార్చి.. నగదు బదిలీ సమయంలో ఎస్​ఎమ్​ఎస్​ అలర్ట్​లు రాకుండా చూసుకున్నారు.

2016 నవంబర్​ 8న.. కేంద్రం రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన అనంతరం.. ఆర్​బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. మూడు కంపెనీల ఖాతాల్లో రూ. 12.84కోట్ల నగదును వేశారు. ఇందుకు సభర్వార్​ సహకరించారు.

ఫోన్​ నెంబర్లు మార్చిన అనంతరం ఈ సొమ్మును ఆర్​టీజీఎస్​(రియల్​ టైమ్​ గ్రాస్​ సెటిల్మెంట్​) ద్వారా వివిధ బ్యాంక్​ ఖాతాలకు బదిలీ చేశారు.

ఇదీ చదవండి : మొదటి స్వదేశీ మెషీన్ గన్​ అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.