ETV Bharat / bharat

మరో ముగ్గురు కశ్మీర్​ నేతలకు నిర్బంధం నుంచి విముక్తి - former chief minister Mehbooba Mufti

జమ్ముకశ్మీర్​లో మరో ముగ్గురిపై ఉన్న పీఎస్​ఏను అక్కడి యంత్రాంగం రద్దు చేసింది. వీరిలో మాజీ ఐఏఎస్​ అధికారి, ప్రముఖ రాజకీయ నేత షా ఫైజల్​ కూడా ఉన్నారు.

JK administration revokes PSA against Shah Faesal and two PDP leaders
షా ఫైజల్​, పీడీపీ నాయకులపై ఉన్న పీఎస్​సీ చట్టం రద్దు
author img

By

Published : Jun 3, 2020, 6:38 PM IST

Updated : Jun 3, 2020, 8:57 PM IST

మాజీ ఐఏఎస్​ అధికారి షా ఫైజల్​ సహా ఇద్దరు పీడీపీ సభ్యులపై ఉన్న పీఎస్​ఏ(ప్రజా భద్రత చట్టం)ను రద్దు చేస్తున్నట్టు జమ్ముకశ్మీర్​ యంత్రాంగం ప్రకటించింది. ఈ ఇద్దరిలో జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మేనమామ కూడా ఉన్నారు.

ఫైజల్​పై వివాదాస్పద పీఎస్​పీని మరో మూడు నెలలు అమలు చేస్తూ మే 14 ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. అయితే దీనిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర పాలిత ప్రాంత హోంశాఖ విభాగం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత్​ రద్దు చేసిన సమయం నుంచి ఫైజల్​ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు పీఎస్​ఏను ఫైజల్​పై మోపారు. అయితే ఆయన్ని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆయనతో పాటు పీడీపీ పార్టీ నాయకులు సర్తాజ్​ మదానీ, పీర్​ మన్సూర్​ల నిర్బంధాన్నీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. నేషనల్​ కాన్ఫరెన్స్​ ప్రధాన కార్యదర్శి ఆలీ మహమ్మద్​ సాగర్​తో కలిపి మదానీని ప్రభుత్వ బంగ్లాలో ఉంచారు.

ఇదీ చూడండి: 'దిల్లీలోని సెయిల్​ కంపెనీలో ఐదుగురికి కరోనా'

Last Updated : Jun 3, 2020, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.