ETV Bharat / bharat

ఆ కంపెనీలో 10వేలకుపైగా ఉద్యోగులు క్వారంటైన్​

author img

By

Published : Jun 12, 2020, 4:12 PM IST

Updated : Jun 12, 2020, 4:52 PM IST

కర్ణాటక బళ్లారి జిల్లాలోని స్టీల్​ ప్లాంట్​లో కరోనా కలకలం రేగింది. 10 వేల మందికి పైగా ఉద్యోగులను గృహనిర్బంధానికి పంపింది యాజమాన్యం. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో వందలాది బెడ్​లను సిద్ధం చేసింది.

Jindal plant Grapple with COVID-19: More than 10K Employees sent to Home quarantine
ఒకే పరిశ్రమలో 10వేలకు పైగా ఉద్యోగులు హోం క్వారంటైన్​!

కర్ణాట బళ్లారి జిల్లా తొరంగల్లులోని జిందాల్​ ఉక్కు పరిశ్రమ కరోనా కేసులతో సతమతమవుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఫ్యాక్టరీలో పనిచేసే 10 వేల మంది ఉద్యోగులను గృహ నిర్బంధంలో ఉంచాలని నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.

గత తొమ్మిది రోజుల్లోనే జిందాల్​ టౌన్​షిప్​ పరిసరాల్లోని 20 ప్రాంతాల్లో కరోనా విజృంభించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలను కట్టడి చేశారు పోలీసులు. ఆరోగ్య, రెవెన్యూ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కొవిడ్​ లక్షణాలతో బాధపడుతున్నవారి సమాచారం తీసుకుంటున్నారు. దీంతో జిందాల్​ గ్రూప్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక డిప్యూటి కమిషనర్ ఎస్​ ఎస్​ నకుల్​ సూచనల మేరకు.. 10,751 మంది ఉద్యోగులను నాలుగు రోజుల పాటు ఇంటికే పరిమితం చేశారు.

జిందాల్​ గ్రూప్ సమాచారం మేరకు... ఈ 10వేల మందిలో 4,262 మంది తొరంగల్లు గ్రామానికి చెందినవారే. 3,207 మంది జిందాల్ టౌన్​షిప్​, మిగిలిన వారు బళ్లారి, సందూర్​ తాలూకాలకు చెందిన వారున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ​ వందలాది బెడ్​లు సిద్ధం చేసింది జిందాల్ యాజమాన్యం.

ఇదీ చదవండి:ఆర్డర్​ చేస్తే నిమిషాల్లో 'అమ్మ చేతి వంట' ప్రత్యక్షం

Last Updated : Jun 12, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.