ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. హేమంత్ ఈ నెల 29 మొహ్రాబాది మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
అంతకుముందు ఝార్ఖండ్ గవర్నర్‌తో హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఝార్ఖండ్ వికాస్ మోర్చాకు (ప్రజాతాంత్రిక్) చెందిన 50 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు.
కూటమికి 47 స్థానాలు...
81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్-16, ఆర్జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది. భాజపా కేవలం 25 సీట్లకు పరిమితమై.. అధికారాన్ని కోల్పోయింది.
ఇదీ చూడండి: అయోధ్యకు ఉగ్రదాడుల ముప్పు- భద్రత కట్టుదిట్టం