జేఈఈ మెయిన్స్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో 24 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఇందులో తెలుగువారు 11 మంది ఉన్నారు.
తెలంగాణ నుంచి అత్యధికంగా 8 మంది వంద శాతం మార్కుల ఘనత అందుకోగా.. దిల్లీ నుంచి ఐదుగురు, రాజస్థాన్లో నలుగురు, ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు, హరియాణాలో ఇద్దరు గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించారు.
కరోనా వల్ల రెండు సార్లు జేఈఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. చివరకు సెప్టెంబర్ 1-6 మధ్య పరీక్షలు నిర్వహించారు. 8.58 లక్షల మంది జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం నమోదు చేసుకోగా.. 74 శాతం మంది హాజరయ్యారు.
జేఈఈ మెయిన్స్ పేపర్ 1, 2లలో వచ్చిన మార్కుల ఆధారంగా 2.45 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. అడ్వాన్స్డ్ పరీక్ష ద్వారా భారత్లోని ఐఐటీ సహా అత్యున్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు వీలు కలుగుతుంది. సెప్టెంబర్ 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది.