మహారాష్ట్ర పుణెకు చెందిన చిరాగ్ ఫలోర్ జేఈఈ-మెయిన్స్‌లో టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ దిల్లీ విడుదల చేసిన జేఈఈ ఫలితాలల్లో 352 మార్కులతో 1వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
ఇప్పటికే అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో చదువుతున్న చిరాగ్.. అక్కడే తన విద్యను కొనసాగిస్తానని తెలిపాడు. మార్చిలో ఎంఐటీలో ప్రవేశం పొందినా కరోనా కారణంగా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు.
"ఐఐటీలో సీటు పొందడం చాలా కష్టం. దీని కోసం నాలుగేళ్లు తీవ్రంగా శ్రమించాను. పగలు ఐఐటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ... రాత్రి ఎంఐటీ తరగతులకు హాజరయ్యాను. ఎంఐటీ... అభ్యర్థి వ్యక్తిత్వాన్ని మాత్రమే చూడదు. నాయకత్వ లక్షణాలను కూడా అంచనా వేస్తుంది." - చిరాగ్ ఫలోర్
చిరాగ్ ఫలోర్ 2020 సంవత్సరానికి గాను బాల శక్తి పురస్కార్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్నాడు.
ఈ ఏడాది జేఈఈ-మెయిన్స్‌కి లక్షా 60వేల మంది దరఖాస్తు చేసుకోగా... లక్షా 50వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 43 వేల మంది మాత్రమే అర్హత సాధించారు.
ఇదీ చూడండి: 'కృత్రిమ మేధకు గ్లోబల్ హబ్‌గా భారత్ అవతరించాలి'