ఎన్డీఏ భాగస్వామ్యపక్షం జేడీయూ నూతన మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకుంది. భాజపా ప్రతిపాదించిన మంత్రి పదవుల సంఖ్య... తమ పార్టీకి ఆమోదయోగ్యం కానందునే మంత్రివర్గంలో చేరడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.
"మేము కేంద్రప్రభుత్వంలో చేరడం లేదు. ఇది మా నిర్ణయం."
- పవన్ కుమార్ వర్మ, జేడీయూ ప్రధాన కార్యదర్శి
భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన జేడీయూ అధినేత నితీష్‌కుమార్... తమకు రెండు కేబినెట్ పదవులు కావాలని కోరారు. అయితే... ఒక కేబినెట్ పదవి మాత్రమే ఇస్తామని షా స్పష్టం చేశారు. ఈ పరిణామంతో నూతన మంత్రివర్గంలో చేరకూడదని జేడీయూ నిర్ణయించుకుంది.
మంత్రివర్గంలో చేరకపోయినప్పటికీ ఎన్డీఏలో కొనసాగనున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ స్పష్టంచేశారు.
2017 నుంచి కొనసాగుతున్న బంధం..
బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ...2017లో ఎన్డీఏలో భాగస్వామి అయ్యింది. తాజా ఎన్నికల్లో... బిహార్‌లోని మొత్తం 40 పార్లమెంట్ స్థానాల్లో... జేడీయూ 16 స్థానాల్లో విజయం సాధించింది.
ఇదీ చూడండి: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ