జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లో తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన ప్రశ్నలు తొలగించాలని కేంద్రాన్ని కోరింది జేడీయూ. దిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశం వేదికగా ఈ అభ్యర్థన చేసింది. ఈ విషయాన్ని జేడీయూ నేత లలన్ సింగ్ వెల్లడించారు. దీనిపై చర్చ జరుపుతామని హోంమంత్రి అమిత్షా సమాధానమిచ్చినట్లు తెలిపారు.
జేడీయూ అభ్యర్థనను మరో కూటమి పార్టీ అకాలీ దళ్ కూడా సమర్థించిందని సమచారం.
ఇదే అంశమై ప్రభుత్వం ఇంతకుముందే వివరణ ఇచ్చింది. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లో తల్లిదండ్రుల పుట్టిన స్థలం, జన్మించిన తేదీ వంటి వివరాలు తెలపడం ప్రజల ఇష్టమని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి శిక్ష మళ్లీ వాయిదా