ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమైన సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.
ఏ చిన్న అవాంఛనీయ ఘటనకు తావివ్వకుండా పహారా కాస్తున్నాయి బలగాలు. రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి... ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.
ఇప్పటికే జమ్ము, శ్రీనగర్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రముఖ రాజకీయ నేతలకు గృహ నిర్బంధం విధించారు.
మరిన్ని బలగాలు...
జమ్ముకశ్మీర్‌కు కేంద్రం మరిన్ని బలగాలను తరలిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, అసోం సహా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి పారామిలటరీ దళాలకు చెందిన 8 వేల మందిని కశ్మీర్‌కు వాయుమార్గంలో పంపుతోంది.
హైఅలర్ట్...
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యం, వాయుసేనకు సూచించింది కేంద్రం.