జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
నర్వాణి ప్రాంతంలో ముష్కరులు దాగి ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టాయి భద్రత దళాలు. జవాన్లపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.
అదనపు బలగాలను మోహరించి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.