ETV Bharat / bharat

​​​​​​​గలగలల దాల్ సరస్సు​ కళ తప్పెనే! - himalayas

జమ్ముకశ్మీర్​ తలమానికంగా పేరుగొన్న దాల్​ సరస్సు పర్యటకులతో కిటకిటలాడుతూ ఉండేది. కానీ ఆర్టికల్​ 370 రద్దుతో.. ఆ అందమైన సరస్సులో పడవ విహారాలు, జనసందోహాలు అన్నీ కరువయ్యాయి.

​​​​​​​గలగలల దాల్ సరస్సు​ కళ తప్పెనే
author img

By

Published : Aug 23, 2019, 6:32 AM IST

Updated : Sep 27, 2019, 11:03 PM IST

​​​​​​​గలగలల దాల్ సరస్సు​ కళ తప్పెనే!

జమ్ము కశ్మీర్​లో 370 అధికరణం రద్దు ఆ ప్రాంత పర్యటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.

జమ్ము కశ్మీర్​ అనగానే అందమైన లోయలు, పొగ మంచు కప్పేసిన కొండలు, చల్లగా వీచే గాలులు, పొడవైన దేవదారు వృక్షాలు, హొయలు పోయే సరస్సులు కళ్ల ముందు కదలాడుతాయి. ఆ అందాలను చూసేందుకు దేశ విదేశాలనుంచి విచ్చేసే వీక్షకులతో ఆ ప్రదేశమంతా సందడిగా ఉండేది. కానీ ఆ అందాలకిప్పుడు ఆదరణ కరువైంది.

ఆర్టికల్​ 370 రద్దుతో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయోనన్న భయంతో పర్యటక ప్రదేశాలన్నీ వెలవెలబోతున్నాయి. జమ్ముకశ్మీర్​ రాజధాని శ్రీనగర్​కే ఆభరణంగా కొనియాడే దాల్​ సరస్సు ఇప్పుడు కళ తప్పింది. ఆ రాష్ట్ర వార్షికాదాయంలో పూల సరస్సుగాను పిలిచే దాల్​ కీలక పాత్రపోషిస్తుంది. కానీ, ఇప్పటి పరిస్థితులు ప్రభుత్వ ఆదాయంతో పాటు ఆ ప్రాంతంలోని చిన్న వ్యాపారస్థులకూ తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి.

ఇదీ చూడండి: ఎంత అదృష్టం ఉంటే ఆ చిన్నారి బతికి బైటపడ్డాడు!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.