సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోమారు దుశ్చర్యకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా గల్పుర్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది పాక్ సైన్యం.
ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.
దాయాది కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారని తెలిపారు పూంచ్ డిప్యూటి కమిషనర్ రాహుల్ యాదవ్. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇటీవల పాక్ పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాహుల్ విమర్శలకు జైశంకర్ ఘాటు జవాబు