జమ్ముకశ్మీర్ నగ్రోటాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు నిర‌్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈక్రమంలో తారసపడిన ముష్కరులు బలగాలపై కాల్పులు జరిపారు. తేరుకుని భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఘటనా స్థలం నుంచి 11 ఏకే-47 ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నలుగురు ముష్కరులు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలనానికి సమీపంలో ఉన్న జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు పోలీసులు. నగ్రోటా చెక్‌పోస్ట్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.