లోయలో పడ్డ కారు- 9మంది మృతి
జమ్ము కశ్మీర్ కతువాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు 300 అడుగుల లోతైన లోయలో బస్సు పడిపోవడం వల్ల తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు.
శనివారం సాయంత్రం 5.30 గంటలకు మారుమూల గ్రామమైన మల్లార్లో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు బాధితులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.