భారతీయులందరికీ జల భద్రత కల్పించడమే లక్ష్యంగా జల శక్తి శాఖకు 2019-20 వార్షిక బడ్జెట్లో రూ.28,261 కోట్లు కేటాయించింది కేంద్రం. గతంలో వేర్వేరుగా ఉన్న తాగునీరు, పారిశుద్ధ్య, జల వనరులు, గంగానది ప్రక్షాళన మంత్రిత్వ శాఖలను ఏకం చేసి జలశక్తి శాఖగా మార్చింది.
దేశవ్యాప్తంగా సుస్థిర నీటి సరఫరా నిర్వహణ లక్ష్యాల సాధన కోసం కేంద్ర కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో జలజీవన్ మిషన్ కింద 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు కుళాయి నీటిని అందించేందుకు కృషి చేయాలని భావిస్తోంది. తాగునీరు, పారిశుద్ధ్యం విభాగం, నీటి నిర్వహణలో స్థానిక స్థాయిలో డిమాండ్‌కు తగ్గట్లు సరఫరాపై దృష్టి పెట్టనుంది.
ఇదీ చూడండి: బడ్జెట్ 2019-20 అంచనా: రూ. 27.86 లక్షల కోట్లు