ETV Bharat / bharat

అరుణ్​ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం..! - అడ్వాణీ

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దిల్లీ ఎయిమ్స్‌ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఇప్పటికే భాజపా అగ్రనేతలంతా వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అరుణ్​ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం
author img

By

Published : Aug 24, 2019, 5:16 AM IST

Updated : Sep 28, 2019, 1:51 AM IST

శ్వాస సంబంధిత సమస్యలతో ఎయిమ్స్​లో చేరిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం శుక్రవారం మరింత క్షీణించింది. దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రి వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి.

భాజపా సీనియర్ నేత ఉమాభారతి నిన్న ఎయిమ్స్​కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇప్పటికే భాజపా అగ్రనేతలు ఎల్​ కే అడ్వాణీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య స్థితిని వాకబు చేశారు.

66 ఏళ్ల జైట్లీ ఆగస్టు 9న శ్వాస సంబంధ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 10 నుంచి.. జైట్లీ ఆరోగ్యంపై ఎయిమ్స్‌.. ఎలాంటి ఆరోగ్య బులిటన్లు విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆయన ప్రాణాధార వ్యవస్థపై ఉన్నారని, పరిస్థితిని వైద్య నిపుణుల బృందం..ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని మాత్రమే ఎయిమ్స్‌ చెబుతోంది.

Vijayawada (AP), Aug 23 (ANI): Cigarettes worth Rs 10 lakh were seized during search operations by taskforce police on Aug 22 in Vijayawada within the purview city police commissionerate. The cigarettes were being sold illegally, without necessary permissions.
Last Updated : Sep 28, 2019, 1:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.