శ్వాస సంబంధిత సమస్యతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంఓ)ను అమర్చినట్లు తెలిపారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు.
ఆస్పత్రికి పలువురు నేతలు...
కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, హర్షవర్ధన్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా, భాజపా నేత సతీష్ ఉపాధ్యాయ... ఎయిమ్స్‌కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థతిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
ఆస్పత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు ట్వీట్ చేశారు బీఎస్పీ అధినేత్ర మాయావతి. జైట్లీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: మంత్రుల బృందం భేటీలో అణు విధానంపైనే చర్చ!