విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన 'సుబ్రహ్మణ్యం జై శంకర్'... నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమక్షంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
1977 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన జై శంకర్... చెక్ రిపబ్లిక్(2001-04), చైనా(2009-13), అమెరికా(2014-15) దేశాలకు భారత రాయబారిగా చేశారు. 2015 నుంచి 2018 వరకు విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. చైనాతో డోక్లాం వివాదం పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు. 2018లో ప్రభుత్వ బాధ్యతల నుంచి విరమణ అనంతరం 'టాటా సన్స్' అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశానికి విస్తృత సేవలందించిన జై శంకర్‌ను ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
జై శంకర్ గురించి మరిన్ని వివరాలు...
జననం : 1955 జనవరి 9, దిల్లీ
తండ్రి : కె సుబ్రహ్మణ్యం
భార్య : క్యోకో జై శంకర్
సంతానం : ఇద్దరు కుమారులు, కూతురు
చదువు : సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, జేఎన్‌యూ, దిల్లీ
ఇదీ చూడండి : కేంద్రంలో కొలువుదీరిన మోదీ సర్కార్