గుజరాత్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు విదేశాంగ మంత్రి జైశంకర్ నామపత్రం దాఖలు చేశారు. గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు జితు వఘానీ సమక్షంలో నామినేషన్ వేశారు. గుజరాత్ నుంచి మరో రాజ్యసభ స్థానానికి భాజపా ఓబీసీ విభాగం అధ్యక్షుడు జుగాల్జీ ఠాకూర్ నామపత్రం సమర్పించారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ రాజీనామాలతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.
మరుసటి రోజే...
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో మొదటి ఐదేళ్లు విదేశాంగ కార్యదర్శిగా సేవలందించారు జైశంకర్. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ.. జైశంకర్‌కు మంత్రిమండలిలో చోటు కల్పించారు.
నామపత్రం దాఖలు చేసేందుకు సోమవారమే అహ్మదాబాద్ చేరుకున్నారు జైశంకర్. అక్కడే భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.
పార్లమెంట్ సభ్యులు కానీ వ్యక్తులు మంత్రులుగా నియమితులైతే ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: రాజ్యసభ గుజరాత్ భాజపా అభ్యర్థి జయ్శంకర్