నదుల అనుసంధానంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ అన్నారు. 'కావేరి పిలుపు' పేరుతో ఆయన చేపట్టిన యాత్ర తమిళనాడు నాగపట్నంలో ముగిసింది. అనంతరం చెన్నైలో బహిరంగ సభ నిర్వహించారు.
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన 'కావేరి పిలుపు' యాత్ర తమిళనాడులో ముగిసింది. కావేరీ నదీ తీర పరిరక్షణ లక్ష్యంతో 3,500 కిలోమీటర్ల మేర బైక్ యాత్ర నిర్వహించారు.
కర్నాటకలోని పశ్చిమ కనుమలలో నదీ జన్మస్థలం 'తల కావేరి' నుంచి బంగాళాఖాతంలో కలిసే తమిళనాడులోని నాగపట్టణం వరకు ఈ బైక్ యాత్రను నిర్వహించారు.
ప్రముఖుల హాజరు
యాత్ర ముగింపు అనంతరం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నటి సుహాసిని పాల్గొన్నారు. 'కావేరి పిలుపు' పేరుతో జగ్గీ వాసుదేవ్ చేపట్టిన కార్యక్రమాన్ని అందరూ ప్రశంసించారు.
-
Tamil Nadu could lose 15% of its landmass because of serious marine ingression, if Cauvery and other rivers are not allowed to enter the ocean. -Sg #CauveryCalling @CMOTamilNadu @OfficeOfOPS @hasinimani @pratapreddy @G_K_VASAN pic.twitter.com/Bx6c3Ogj0M
— Sadhguru (@SadhguruJV) September 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tamil Nadu could lose 15% of its landmass because of serious marine ingression, if Cauvery and other rivers are not allowed to enter the ocean. -Sg #CauveryCalling @CMOTamilNadu @OfficeOfOPS @hasinimani @pratapreddy @G_K_VASAN pic.twitter.com/Bx6c3Ogj0M
— Sadhguru (@SadhguruJV) September 15, 2019Tamil Nadu could lose 15% of its landmass because of serious marine ingression, if Cauvery and other rivers are not allowed to enter the ocean. -Sg #CauveryCalling @CMOTamilNadu @OfficeOfOPS @hasinimani @pratapreddy @G_K_VASAN pic.twitter.com/Bx6c3Ogj0M
— Sadhguru (@SadhguruJV) September 15, 2019
కావేరీ- గోదావరి నదుల అనుసంధానంపై గవర్నర్ ప్రసంగించారు. అనుసంధానం జరిగితే సముద్రంలో వృథాగా పోతున్న జలాలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
అనుసంధానంతో ముప్పు
నదుల అనుసంధానాన్ని సభా వేదికపైనే జగ్గీ వాసుదేవ్ వ్యతిరేకించారు. ఈ ప్రక్రియతో భారత్ వంటి ద్వీపకల్ప దేశాలకు ఉపయుక్తం కాదని అభిప్రాయపడ్డారు. 25 నుంచి 50 శాతం నీరైనా సముద్రంలో కలవాలన్నారు. లేదంటే నదీ పరీవాహక ప్రాంతంలోని పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
"కావేరీ నదిని పరిరక్షించాలంటే కేవలం నదిని మాత్రమే కాదు. 85 వేల చదరపు కిలోమీటర్ల కావేరీ పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించాల్సి ఉంటుంది.
100 ఏళ్ల క్రితం నుంచి ఉన్న నీటి వనరులే ఇప్పుడు ఉన్నాయి. కానీ వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి చేర్చటంలో విఫలమవుతున్నాం. ఇందుకు ప్రధాన కారణం భూసారం కోల్పోవడమే. 242 కోట్ల మెుక్కలు నాటితే 12 ట్రిలియన్ లీటర్ల నీటిని భూమిలో దాచుకోవచ్చు."
-జగ్గీ వాసుదేవ్, ఆధ్యాత్మిక గురువు
ఇదీ చూడండి: చేతి అల్లికలతో మహిళల గిన్నీస్ రికార్డు