ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్న జడ్డూ ఇంట్లో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇతని స్వస్థలం గుజరాత్‌లోని జామ్‌నగర్. ఇప్పటికే జడేజా భార్య రివాబ భాజపాలో.. అతని తండ్రి, సోదరి హార్దిక్ పటేల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
రవీంద్ర జడేజా తాజాగా ట్విట్టర్లో భార్య రివాబ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్యాగ్ చేస్తూ భాజపాకే మద్దతు ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఫలితంగా.. ఈ ఆల్‌రౌండర్ నిర్ణయం గుజరాత్ లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంది. ఇక్కడ 26 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో భాగంగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.
-
I support BJP.@narendramodi #rivabajadeja jai hind 🇮🇳 pic.twitter.com/GXNz5o07yy
— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I support BJP.@narendramodi #rivabajadeja jai hind 🇮🇳 pic.twitter.com/GXNz5o07yy
— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019I support BJP.@narendramodi #rivabajadeja jai hind 🇮🇳 pic.twitter.com/GXNz5o07yy
— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019
మార్చి 8న స్థానిక ఎంపీ పూనమ్‌బెన్ సమక్షంలో కాషాయపార్టీ తీర్థం పుచ్చుకున్నారు రివాబ. ఏప్రిల్ 14నే జడేజా తండ్రి అనిరుధ్ సింగ్, సోదరి నైనాబా కాంగ్రెస్‌లో చేరారు.
ఆల్‌రౌండర్ కోటాలో 'జడేజా' ప్రపంచకప్‌నకు వెళ్లే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి: రాజకీయాల్లో క్రీడాకారుల 'పవర్ ప్లే'